తుంగభద్ర డ్యాం 3 గేట్లు ఎత్తిన దిగువకు నీరు..

కర్ణాటక: తుంగభద్ర: 22.07.2024
అధికారులు తెలిపిన సమాచారం మేరకు
నీటి నిలువ ప్రస్తుతం : 87.056 టీ.ఎం.సీ లు
3 గేట్లు 1 అడుగు ఔట్ ఫ్లో : 3987 క్యూసెక్కులు
నదికి ఔట్ ఫ్లో: 7744 క్యూసెక్కులు
ప్రస్తుతం నీటిమట్టం : 1628.09 అడుగులు

హెచ్.ఎల్.సి ఎల్ఎల్సీ కెనాన్లకు వదిలిన నీరు

కర్ణాటక: తుంగభద్ర: తుంగభద్ర డ్యామ్ మూడు గేట్లు ఒక అడుగు ఎత్తి దిగువకు నీళ్లు వదిలారు అధికారులు. ముందుగా పూజలు నిర్వహించి హెచ్ ఎల్ సి ఎల్ఐసి కెనాల్ లకు నీళ్లు వదిలారు అనంతరం తుంగభద్ర డాం మూడు గేట్లను ఒక్క అడుగు మేర పైకెత్తి నదిలోకి నీళ్లు వదిలారు డామాధికారులు.

గేట్లు తెరిచి నీళ్లు వదులుతున్న వీడియో
హెచ్ ఎల్ సి ఎల్ ఎల్ సి కి నీళ్లు వదులుతున్న అధికారి

ఎగువన వర్షాలు కురుస్తుండడంతో తుంగభద్ర రిజర్వాయర్‌లోకి భారీగా వరద నీరు పోటెత్తింది. ప్రతిరోజు సుమారుగా 1 లక్ష 24 వేల 129 క్యూసెక్కుల నీరు డ్యామ్ కు చేరుతుంది. పైనుంచి వస్తున్న వరద నీటితో తుంగభద్ర రిజర్వాయర్‌లోకి ఇన్‌ఫ్లో పెరగడంతో మిగులు నీటిని తుంగభద్ర డ్యాం గేట్లు ఎత్తే నదిలోకి సోమవారం సాయంత్రం వదిలారు. తుంగభద్ర నది కి ఆనుకుని ఉన్న దిగువ గ్రామాలలోని సంబంధిత అధికారులు మరియు ప్రజలందరు అప్రమత్తంగా ఉండాలని డ్యాం అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

నీళ్లు వదలడానికి పూజలు చేస్తున్న అధికారులు
పూజలు చేస్తున్న అధికారులు
హెచ్.ఎల్.సి ఎల్ఎల్సీ కెనాన్లకు వదిలిన నీరు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *