కర్ణాటక: తుంగభద్ర: 21.07.2024
తుంగభద్ర డ్యామ్ కు భారీ పెరిగిన వరద దిగువకు 2324 క్యూసెక్కుల నీరు
ఇన్ ఫ్లో : గడచిన 24 గంటల్లో 112101 క్యూసెక్కులు
ఇన్ ఫ్లో : ప్రస్తుతం(Live) 119000 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 2324 క్యూసెక్కులు
పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులు
ప్రస్తుతం నీటిమట్టం : 1624.41 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీ.ఎం.సీ లు
ప్రస్తుతం : 74.582 టీ.ఎం.సీ లు
కర్ణాటక: తుంగభద్ర: తుంగభద్ర డ్యామ్ అధికారులు తెలిపిన సమాచారం మేరకు
ఎగువన వర్షాలు కురుస్తుండడంతో తుంగభద్ర రిజర్వాయర్‌లోకి భారీగా వరద నీరు పోటెత్తింది. ప్రతిరోజు సుమారుగా 1 లక్ష 19 వేల క్యూసెక్కుల నీరు డ్యామ్ కు చేరుతుంది. పైనుంచి వస్తున్న వరద నీటితో తుంగభద్ర రిజర్వాయర్‌లోకి ఇన్‌ఫ్లోలు పెరిగే అవకాశం ఉన్నందున మిగులు నీటిని తుంగభద్ర డ్యాం గేట్లు ఎత్తే నదిలోకి వదిలే అవకాశం ఉంది. తుంగభద్ర నది కి ఆనుకుని ఉన్న దిగువ గ్రామాలలోని సంబంధిత అధికారులు మరియు ప్రజలందరు అప్రమత్తంగా ఉండాలని మరియు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని డ్యాం అధికారులు ఆదేశాలు జారీ చేశారు.