ఒక మైనర్ బాలిక పై అత్యాచారం చేసి ఆమె జీవితాన్ని నాశనం చేశాడని బాధితురాలు పోలీసులకు చేసిన పిర్యాదుతో సుధాకర్ నీ అరెస్టు చేసిన కర్నూలు 2 టౌన్ పోలీసులు.

వివరాల్లోకి వెళితే కర్నూలులో నివాసముండే యువతి కోడుమూరు మాజీ ఎమ్మెల్యే Dr సుధాకర్ పై పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో 2019 లో తనకి 15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు మున్సిపల్ ఆఫీస్ దగ్గర వున్న స్వప్నలోక్ అపార్టుమెంటులో నివసిస్తున్న Dr సుధాకర్ ఇంట్లో పని చేసేది అని , ఇంట్లో ఎవరూ లేని సమయం తనను శారీరకంగా వాడుకుని ఎవరికైనా చెబితే తన తల్లితండ్రులను చంపేస్తానని బెదిరిస్తూ, పలుమార్లు వీడియోలు చూపిస్తూ నన్ను శారీరకంగా వాడుకున్నాడని , అప్పట్లో అతను ఎమ్మెల్యే కావడంతో భయపడి ఈ విషయం ఎవరికీ చెప్పలేదని, అయినప్పటికీ అతని ఆగడాలు తట్టుకోలేక ఒకేరోజు తన సెల్ ఫోన్ లో సుధాకర్ బలవంతంగా చేసిన అకృత్యాలు వీడియోలు చిత్రించాను. అతనికి భయపడి ఈ విషయం కూడా ఎవరికీచెప్పలేదని , 2019 నుండి 2023 నవంబర్ నెల వరకు సుధాకర్ తనను లైంగికంగా , శారీరకంగా అనుభవించి జీవితం నాశనం చేశాడని బాధితురాలు కర్నూలు 2 టౌన్ లో పిర్యాదు చేసింది. బాధితురాలు తీసిన వీడియో ఇప్పుడు వైరల్ కావడంతో Dr సుధాకర్ ని అరెస్టు చేసి అతని పై ఫోక్సో చట్టం ప్రకారం 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఎఫ్ ఐ ఆర్ కాఫీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *