Category: News

తుంగభద్రా డ్యాం దిగువ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ

తుంగభద్రా డ్యాం దిగువ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీతుంగభద్ర డ్యామ్ నీటి నిలువ వివరాలుఇన్ ఫ్లో : 35425 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 109526 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1629.26 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం : 91.311 టీఎంసీలు 13 08 2024 మంగళవారం ఉదయం 1 లక్ష 14 వేలకు పైగా నీరుని నదిలోకి వదులుతున్నామని డ్యాం అధికారులు తెలిపారు. నది తీర […]

ఆగస్టు 15వ తేదీన అన్న క్యాంటీన్ల ప్రారంభం

ఆగస్టు 15వ తేదీన అన్న క్యాంటీన్ల ప్రారంభం..! తొలి విడతలో 100 అన్న క్యాంటీన్ల ప్రారంభించనున్న ప్రభుత్వం… కృష్ణా జిల్లా ఉయ్యూరులో సాయంత్రం 6.30 గంటలకు అన్న క్యాంటీన్‌ను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు… ఆగస్టు 16వ తేదీన మిగిలిన 99 క్యాంటీన్లను ప్రారంభించనున్న మంత్రులు, ఎమ్మెల్యేలు.

శ్రీశైలం డ్యామ్ గేట్లు మూసివేత

శ్రీశైలం జలాశయానికి వరద ఇన్ ఫ్లో తగ్గడంతో డ్యామ్ గేట్లు మూసివేశారు. విదుత్ ఉత్పాదన అనంతరం దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం డ్యామ్ అధికారులు తెలిపిన నీటినిలువ వివరాలు ఇలా ఉన్నాయి… ఇన్ ఫ్లో : 86,220 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 68,211 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులుప్రస్తుతం : 880.80 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలుప్రస్తుతం : 192.5300 టీఎంసీలు కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నట్లు […]

అందరికీ ఉపాధి పనులు కల్పించాలి వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్

ఆదోని మండలంలోని గ్రామాలలో 11 వారాలుగా పెండింగ్లో ఉన్న ఉపాధి హామీ వేతనాలు వెంటనే చెల్లించాలని, మండలంలో అందరికీ పనులు కల్పించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆదోని ఏపీఓ కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కే లింగన్న మాట్లాడుతూ గత జూన్ నెల నుండి ఇప్పటి వరకు పనులు చేసిన కూలీలకు వేతనాలు అందలేదని, దీంతో ఉపాధి హామీ కూలీలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని […]

స్కూళ్లలో వంట ఏజెన్సీ లపై చర్యలు తీసుకోండి

ఆదోని నియోజకవర్గలోని గ్రామాలలోని ప్రభుత్వ పాఠశాలల్లో మెనూ ప్రకారంగా మధ్యాహ్న భోజనం పెట్టని స్కూల్లలో వంట ఏజెన్సీ లపై చర్యలు చేపట్టాలని సబ్ కలెక్టర్కు డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షుడు ధనాపురం ఉదయ్ మాట్లాడుతూ కొన్ని ప్రభుత్వ పాఠశాలలో మెనూ ప్రకారంగా అన్నం పెట్టకుండా విద్యార్థుల కడుపు కొడుతున్న వంట ఏజెన్సీ లపై తక్షణమే చర్యలు తీసుకోవాలి లేని లేనిపక్షంలో డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులతో పెద్ద […]

సర్పంచ్ , కార్యదర్శుల కు శిక్షణ కార్యక్రమం

కర్నూలు జిల్లా ఆదోని ఎంపీడీఓ కార్యాలయం లో సర్పంచ్ , కార్యదర్శుల కు మూడు రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మొదటి రోజు కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి పాల్గొన్నారు. దొడ్డనగేరి సర్పంచ్ పార్వతమ్మ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఇబ్బందులు పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం లాగా మీరుకూడా ఇబ్బందులకు గురి చేయకుండా గ్రామ అభివృద్ధి కోసం కృషి చేయాలని ఎమ్మెల్యేకు విన్నవించుకొన్నారు.

దేవాలయ భూములను కబ్జా చేసినవారిపై చర్యలు తీసుకోవాలి

కర్నూలు జిల్లా ఆదోనిలో దేవాలయ భూములను కబ్జా చేసినవారిపై చర్యలు తీసుకోవాలని మన గుడి ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి గ్రీవెన్స్ లో సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కో కన్వీనర్ నాగరాజు గౌడ్ మాట్లాడుతూ మనగుడి సంస్థ ద్వారా ఆదోని మండలంలో సమాచార హక్కు ద్వారా స్వీకరించిన వివరాలలో సర్వే నంబర్ల పాత సర్వే నెంబర్లతో మ్యాచ్ అవడం లేదని, రికార్డుల […]

బస్సు స్కూటర్ ఢీ ఇద్దరికీ గాయాలు

కర్నూలు జిల్లా ఆదోని మండలం ఇస్వీ గ్రామ సమీపంలో రైల్వే బ్రిడ్జి పైన బస్సు స్కూటర్ ఢీ కొట్టడంతో కోసిగి మండలం, డి బెలగల గ్రామానికి చెందిన లక్ష్మన్న, తలారి వెంకటేష్ ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే కర్నూల్ డిపో2 పల్లె వెలుగు స్పెషల్ బస్సు ఉరుకుంద కు వెళ్లి తిరిగి వస్తుండగా ఆదోని […]

ఫోన్ మాట్లాడుతూ నీటిలో పెట్టాల్సిన హీటర్ చంకలో పెట్టుకొని వ్యక్తి మృతి

◆ ఫోన్ మాట్లాడుతూ నీటిలో పెట్టాల్సిన హీటర్ చంకలో పెట్టుకున్న వ్యక్తి..◆ షాక్ కొట్టి మృతిఖమ్మం: స్థానిక కాల్వ ఒడ్డునున్న హనుమాన్ గుడి సమీపంలో దోనెపూడి మహేశ్ బాబు (40) ఆదివారం రాత్రి ఆయన ఇంట్లో పెంపుడు కుక్కకు స్నానం చేయించేందుకు వేడినీళ్ల కోసం హీటర్ ఆన్ చేయబోయారు. ఈలోగా ఫోన్ రావడంతో మాట్లాడుతూ.. హీటర్‌ను నీటిలో బదులు చంకలో పెట్టుకుని స్విచ్ ఆన్ చేశారు. దీంతో విద్యుదాఘాతానికి గురై కింద పడిపోయారు. అప్రమత్తమైన భార్య దుర్గాదేవి […]

పత్తి పంట ఎండిపోవడంతో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్యాయత్నం

కర్నూలు జిల్లా ఆస్పరి మండలం అయినకల్ గ్రామానికి చెందిన రైతు రామచంద్ర (48 సం) పత్తి పొలంలో పురుగుల మందు త్రాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొడుకు ఉదయ్ తెలిపిన వివరాలు ఇలాఉన్నాయి. కౌలుకు చేస్తున్న10ఎకరాలలో పత్తి పంట సాగు చేస్తున్న మని తెలిపాడు. అప్పు చేసి పెట్టుబడి పెట్టిన పొలం ఎండిపోవడంతో ఉదయం పొలానికి మందు కొట్టడానికి వెళ్లి మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేశాడని పక్క పొలం ఉన్న కొడుకు ఉదయ్ చూసుకొని […]

Back To Top