కర్నూలు జిల్లా ఆస్పరి మండలం అయినకల్ గ్రామానికి చెందిన రైతు రామచంద్ర (48 సం) పత్తి పొలంలో పురుగుల మందు త్రాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కొడుకు ఉదయ్ తెలిపిన వివరాలు ఇలాఉన్నాయి. కౌలుకు చేస్తున్న10ఎకరాలలో పత్తి పంట సాగు చేస్తున్న మని తెలిపాడు. అప్పు చేసి పెట్టుబడి పెట్టిన పొలం ఎండిపోవడంతో ఉదయం పొలానికి మందు కొట్టడానికి వెళ్లి మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేశాడని పక్క పొలం ఉన్న కొడుకు ఉదయ్ చూసుకొని వెంటనే బంధువులకు సమాచారం ఇచ్చి హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని తెలిపారు.