పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.. గుడిసె కృష్ణమ్మ

పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నివారించాలని, ఎక్కడపడితే అక్కడ చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు వేయవద్దని జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ స్థానిక ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మీడియాతో మాట్లాడుతున్న గుడిసి కృష్ణమ్మ
పూర్తి వీడియో చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

కర్నూలు జిల్లా ఆదోని మండలం మండిగిరి గ్రామ పంచాయతీ పరిధిలో ‘స్వచ్ఛ భారత్’ స్పూర్తితో ‘స్వచ్ఛ ఆదోని’ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె తన బృందంతో కలిసి స్వయంగా రంగంలోకి దిగి డ్రైనేజీ కాలువల్లోని పూడిక, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి శుభ్రం చేశారు.

కాలువలను శుభ్రం చేస్తున్న గుడిసె కృష్ణమ్మ

అనంతరం ఆమె మాట్లాడుతూ.. డ్రైనేజీ కాలువల్లో ప్లాస్టిక్ కవర్లు, వ్యర్థాలు వేయడం వల్ల మురుగునీటి ప్రవాహం నిలిచిపోయి, దోమలు వృద్ధి చెంది రోగాలు ప్రబలే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.

అధికారులతో మాట్లాడుతున్న గురు శ్రీ కృష్ణమ్మ

మండిగిరి గ్రామపంచాయతీ పరిధిలో డ్రైనేజీ వ్యవస్థ లేని ప్రాంతాలను గుర్తించి, త్వరలోనే ప్రతిపాదనలు (ప్రపోజల్స్) సిద్ధం చేసి కొత్త డ్రైనేజీలు నిర్మిస్తామని ఆమె స్పష్టం చేశారు. అలాగే స్థానికంగా ఉన్న తీవ్రమైన తాగునీటి సమస్యను గ్రామస్థులు ఆమె దృష్టికి తీసుకురాగా, సంబంధిత అధికారులతో మాట్లాడి తాగునీటి ఎద్దడి తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

స్వయంగా రంగంలోకి దిగి పనిచేస్తున్న గుడిసె కృష్ణమ్మ
Back To Top