ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం.. ఉమాపతి నాయుడు

ఆదోని: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెండు సంవత్సరాల విజయవంతమైన పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆదోని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు ఆదోని పట్టణంలో ‘డోర్ టు డోర్’ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. పట్టణంలోని 21వ వార్డు సాయిబాబా నగర్‌లో టీడీపీ సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

సంక్షేమ పథకాల గురించి వివరిస్తున్న ఉమాపతి నాయుడు

ఈ సందర్భంగా నాయకులు ఇంటింటికీ తిరిగి, గత రెండేళ్లలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. స్థానికుల సమస్యలను స్వయంగా విన్నవించుకున్న ఉమాపతి నాయుడు, వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

స్థానికులను మాట్లాడిస్తున్న ఉమాపతి నాయుడు

ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు తిమ్మప్ప, క్లస్టర్-8 ఇన్‌చార్జ్ లక్ష్మీనారాయణ, నాయకులు రంగస్వామి నాయుడు, జిందేశంకర్, రామస్వామి, రంగన్న, షేకన్న, వెంకటేష్, రత్నం, నాగేష్, గోపాల్, బాబులతో పాటు వార్డు నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంక్షేమ పథకాల గురించి వివరిస్తున్న భూపతి నాయుడు
Back To Top