కర్నూలు జిల్లా ఆదోనిలో దేవాలయ భూములను కబ్జా చేసినవారిపై చర్యలు తీసుకోవాలని మన గుడి ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి గ్రీవెన్స్ లో సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కో కన్వీనర్ నాగరాజు గౌడ్ మాట్లాడుతూ మనగుడి సంస్థ ద్వారా ఆదోని మండలంలో సమాచార హక్కు ద్వారా స్వీకరించిన వివరాలలో సర్వే నంబర్ల పాత సర్వే నెంబర్లతో మ్యాచ్ అవడం లేదని, రికార్డుల మధ్య ఎకరాల వ్యత్యాసం, హక్కుదారుల పేర్లు మారిపోయాయని, ఇతర పేర్లు ఉన్నాయని ఆరోపించారు. కొన్ని దేవాలయాలు సంబంధించిన భూములను అవసరాలకు వాడుకుని బదులుగ ఎక్కడ కూడా భూములు కేటాయించక పోవడం హిందువుల మనోభావాలను దెబ్బతీయడంతో సమానమని ఆవేదన వ్యక్తం చేశారు. అన్యాక్రాంతమైన దేవాలయ భూములు తిరిగి ఆయా దేవాలయాలకు చెందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, దేవాలయ భూములను ప్రభుత్వ అవసరాల కోసం ఉపయోగించుకున్న గ్రామాలలో ఆయా దేవాలయాలకు ప్రత్యేకమైన భూములను కేటాయించేందుకు చర్యలు చేపట్టి దేవాలయ భూములు వేరే వ్యక్తుల పేర్ల మీద ఉన్న వాటిని విచారణ జరిపి, దేవాలయం పేరును నమోదు చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు.