ఆదోని మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ప్రణీత రెడ్డి ఖరారు

కర్నూలు జిల్లా ఆదోని పురపాలక సంఘం (మున్సిపల్) చైర్మన్ అభ్యర్థి ఎంపికపై గత కొద్దిరోజులుగా నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ప్రణీత రెడ్డి పేరును అధిష్టానం అధికారికంగా ఖరారు చేసింది.

ప్రణీత రెడ్డి

ఈ పదవి కోసం పార్టీలోని పలువురు సీనియర్ నాయకుల పేర్లు గట్టిగా వినిపించినప్పటికీ, స్థానిక రాజకీయ సమీకరణాలు, పార్టీ పట్ల వారికున్న విధేయతను పరిగణనలోకి తీసుకుని అధిష్టానం ప్రణీత రెడ్డి వైపే మొగ్గు చూపింది. ప్రముఖ వ్యాపారవేత్త (భారత్ గ్యాస్), మాజీ కౌన్సిలర్ సందీప్ రెడ్డి సతీమణి అయిన ప్రణీత రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయిప్రసాద్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. ప్రణీత రెడ్డి పేరు ఖరారు కావడంతో ఆదోని పట్టణ రాజకీయాల్లో ఒక్కసారిగా నూతనోత్సాహం నెలకొంది. పార్టీ కేడర్‌తో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు

సందీప్ రెడ్డి ప్రణీత రెడ్డి