శ్రీశైలం లలితాంబిక షాపింగ్ కాంప్లెక్స్ లో అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో విద్యుత్ తీగలు తెగి షాపులపై పడడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో 12 షాపులు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. అప్రమత్తమైన దేవస్థానం అధికారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఫైర్ సిబ్బంది దేవస్థానం ట్యాంకర్లతో మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో సుమారు 2 కోట్ల ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని అధికారులు అంచనా వేశారు. రెండు త్రిచక్ర వాహనాలు ధ్వంసం అయ్యాయి. షాపుల పైనే విద్యుత్ స్తంభాలు ఉండడంతో షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందని దేవస్థానం అధికారులు అంచన వేశారు.