Day: August 11, 2023

వీధి దీపాలు వెలిగించాలని క్యాండిల్స్ తో నిరసన

ఆదోని పట్టణంలో భీమ్ రెడ్డి కాలనీలో వీధిలైట్లు వేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో క్యాండిల్ వెలిగించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మన్న మాట్లాడుతూ భీమ్ రెడ్డి కాలనీ నందు వీధిలైట్లు వేయాలని కాలనీవాసులు సంబంధిత అధికారులకు తెలిపిన చెవిటి వాడి ముందు శంఖం ఉదినట్లు చందంగా ఉందని అన్నారు. కాలనీలలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో సంబందిత అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని వారు తెలిపారు. కాలనీ నందు వీధిలైట్లు వెలగకపోవడంతో […]

విద్యుత్ సరఫరాలో అంతరాయం

కర్నూలు జిల్లా ఆదోనిలో శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ ఏడి పురుషోత్తం శుక్రవారం పత్రికా ప్రకటన లో తెలిపారు. విద్యుత్ మరమ్మతులు, ఇంప్రూవ్మెంట్లో భాగంగా ఆదోని మున్సిపాలిటీ పరిధిలో అన్ని ప్రాంతాలలో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని విద్యుత్ వినియోగదారులకు కలిగిన అసౌకర్యాన్ని చింతిస్తూ తమ సంస్థకు సహకరించాలని ఆయన కోరారు.

ఆదోనిలో గడపగడపకు మన ప్రభుత్వం

అవినీతి రహిత పాలన అమలుపరస్తు ప్రజలకు నేరుగా సంక్షేమ పథకాలు అందించిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అన్నారు.కర్నూలు జిల్లా ఆదోని 30వ వార్డు వడ్డే గేరిలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ పాలుగోన్న. ప్రతి గడపకు తిరుగుతూ వార్డుల సమస్యలు తెలుసుకున్నారు.అనంతరం ఎమ్మెల్యే వై సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన […]

Back To Top
Exit mobile version