Day: August 31, 2023

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

కర్నూలు జిల్లా ఆదోని మండలం దొడ్డన గేరి గ్రామ సమీపంలో బైకును ఢీకొన్న గుర్తుతెలియని ఆటో. జాలిమంచి గ్రామనికి చెందిన శెట్టి బలిజ వీరేష్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సెంట్రింగ్ పని కోసం వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసు లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నరు. మృతుడికి భార్య.. ఇద్దరు పిల్లలు ఉన్నారు.

టిడిపి తమ్ముళ్లు సంఘీభావ పాదయాత్ర..

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో టిడిపి తమ్ముళ్లు సంఘీభావ పాదయాత్ర..నారా లోకేష్ యువగళoపాదయాత్ర 200 రోజులు పూర్తిచేసిన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు. ఇంటి వద్ద నుండి ఎన్టీఆర్ విగ్రహం వరకు సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పాదయాత్రకు మంచి స్పందన ఉందని రాబోయే రోజుల్లో టిడిపి ప్రభుత్వాన్ని ప్రజలు కోరుతున్నారు అని తెలిపారు. ఈ పాదయాత్ర లో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

శ్రీశైలంలో భారీ అగ్ని ప్రమాదం.

శ్రీశైలం లలితాంబిక షాపింగ్ కాంప్లెక్స్ లో అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో విద్యుత్ తీగలు తెగి షాపులపై పడడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో 12 షాపులు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. అప్రమత్తమైన దేవస్థానం అధికారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఫైర్ సిబ్బంది దేవస్థానం ట్యాంకర్లతో మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో సుమారు 2 కోట్ల ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని అధికారులు అంచనా వేశారు. రెండు త్రిచక్ర వాహనాలు ధ్వంసం అయ్యాయి. షాపుల […]

Back To Top
Exit mobile version