స్కూల్ గుర్తింపు రద్దు చేయాలి సబ్ కలెక్టర్ కు వినతి.. DSF

కర్నూలు జిల్లా ఆదోని మండలం ధనాపురం గ్రామం లో గౌరీ గణేష్ ఇంగ్లీష్ స్కూల్ బయట బహిరంగంగా ఫీజులు పట్టిక వేయకుండా ప్రభుత్వ నిబంధనలును ఉల్లంఘిస్తున్నారు అందువల్ల స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని డి ఎస్ ఎఫ్ విద్యార్థి సంఘం ఆదోని సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా DSF జిల్లా ఉపాధ్యక్షుడు ఉదయ్ మాట్లాడుతూ ధనాపురం గ్రామం లో గౌరీ గణేష్ ఇంగ్లీష్ స్కూల్ బయట బహిరంగంగా ఫీజులు పట్టిక వేయకుండా ప్రభుత్వ నిబంధనలును తుంగులో తోకి వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం విద్యార్థులుకు ఆడుకోవడానికి గ్రౌండ్ లేదు పార్కింగ్ ప్లేస్ లేదు సరైన సౌకర్యాలు లేవు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టానుసారంగా గౌరీ గణేష్ స్కూల్ యాజమాన్యం నడుపుతున్నారని తెలిపారు. ఇంత జరుగుతున్నా కూడా ఎంఈఓ ఏమాత్రం పట్టించుకోకపోవడం చాలా బాధాకరంఅని అన్నారు. ఇప్పటికైనా విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని తగిన న్యాయం చేయాలని ఉన్నత విద్యాధికారులను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డిఎస్ఎఫ్ నాయకులు డివిజన్ అధ్యక్షుడు విజయ్ గోవిందరాజులు అరవింద్ కృష్ణ హరి మహానంది విజయ్ తదితరులు పాల్గొన్నారు.

యూట్యూబ్ వీడియో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top