వచ్చే నెలలో ఒకే వేదికపై చంద్రబాబు, రేవంత్ రెడ్డితెలుగు రాష్ట్రాల సీఎంలు త్వరలో ఒకే వేదికపై కనిపించనున్నారు. జులై మూడో వారంలో మొట్టమొదటి ప్రపంచ కమ్మ మహాసభలు హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. ఈ విషయాన్ని కమ్మ మహాసభ నిర్వాహకుడు జెట్టి కుసుమకుమార్ వెల్లడించారు. హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ ఈ ప్రపంచ కమ్మ మహాసభ వేడుకలకు వేదికగా నిలవనుంది.
ఎన్నికలలో పనిచేసిన సిబ్బందికి 1నెల జీతం బోనస్..
చంద్రబాబు నాయుడు ఉదారత..ఎన్నికలలో పనిచేసిన సిబ్బందికి 1నెల జీతం బోనస్ ఇస్తూ చంద్రబాబు ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. దీనిపట్ల ఉద్యోగ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి.. మాములుగా అయితే పనిచేసిన 45 రోజులకు రోజుకు 120 రూపాయలు లెక్కగట్టి జీతం ఇస్తారు.. కానీ వారి గ్రెడ్ ను బట్టి వారికి నెల జీతం బోనస్ గా ఇచ్చింది..
అన్న క్యాంటీన్ లు పునరుద్ధరణకు రూ.189 కోట్లు.
అమరావతి: పేదల ఆకలి బాధలు తీర్చే అన్న క్యాంటీన్ల పునరుద్ధరణకు తక్షణం రూ.189.22కోట్లు అవసరమని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ అంచనాలు వేసింది. ఆర్థికశాఖకు పంపిన ప్రతిపాదనలకు ఆమోదం రాగానే పనులు ప్రారంభించి సాధ్యమైనంత త్వరగా వాటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. తొలి దశలో 183 క్యాంటీన్ల పునరుద్ధరణకు రూ.189.22 కోట్లు అవసరమని ఇంజినీర్లు అంచనాలు వేసి ఆర్థికశాఖకు నిధుల కోసం ప్రతిపాదించారు.
ఆదోనిలో కూరగాయల ధరలు
ఆదోని రైతు బజార్లో ఈరోజు కూరగాయలను ఈ విధంగా ఉన్నాయి 28.06.2024
పెన్షన్ల పంపిణీపై కీలక ప్రకటన
అమరావతీ : పెన్షన్ల పంపిణీకి గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిని వినియోగించుకోవాలని, అవసరమైన చోట ఇతర శాఖల ఉద్యోగులనూ పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఒక్కో ఉద్యోగికి 50 మంది లబ్ధిదారులకు మించకుండా కేటాయించాలని ఉత్తర్వులు జారీ చేసింది. జులై 1న ఉ.6 గంటల నుంచి ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్ ఇవ్వాలని, వీలైనంత వరకు మొదటి రోజే అందరికీ నగదు అందించాలని అధికారులకు స్పష్టం చేసింది.
దుల్హన్ పథకం అమలు
వివాహ పథకం యొక్క ప్రయోజనాలుఆంధ్రప్రదేశ్‌లో దుల్హన్ వివాహ పథకాన్ని పొందడం వల్ల కలిగే ప్రయోజనాలు క్రింది విధంగా వివరించబడ్డాయి: మైనారిటీ కమ్యూనిటీకి చెందిన అమ్మాయికి వివాహ సమయంలో కుటుంబ భారాన్ని తగ్గించుకోవడానికి ఈ పథకం ఆర్థిక సహాయం రూపంలో ప్రయోజనాలను మంజూరు చేస్తుంది.ఈ పథకం కింద, రాష్ట్ర ప్రభుత్వం అమ్మాయి వివాహ వేడుక కోసం రూ.1,00,000 అందిస్తుంది.దరఖాస్తుదారు వివాహ తేదీ నుండి ఒక నెల ముందు పథకం కోసం దరఖాస్తు చేయాలి.అర్హత ప్రమాణంఈ వివాహ పథకం కోసం […]
