కర్నూలు జిల్లా ఆదోని లో ప్రైవేట్ చైతన్య స్కూల్ పై తక్షణమే విచారణ చేసి స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని డి ఎస్ ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేస్తూ డిప్యూటీవో కార్యాలయంలో ఇన్చార్జి చంద్రశేఖర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా జిల్లా ఉపాధ్యక్షుడు ధనాపురం ఉదయ్ మాట్లాడుతూ ఆదోని లో ప్రైవేట్ చైతన్య స్కూల్స్ లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫీజుల పట్టిక బహిరంగంగా వెయ్యకుండా రకరకాల పేర్లతో స్కూల్ ఫీజు, యూనిఫామ్, బుక్స్, ట్యూషన్ ఫీజు ఇలా వేలకు వేలు ఫీజులు దోపిడీ చేస్తున్నారని అగ్రహం వ్యక్తం చేశారు. పదవ తరగతి విద్యార్థులకు స్పెషల్ క్లాస్ లంటూ ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు క్లాసులు నిర్వహిస్తున్నారు తెలిపారు. స్థానిక విద్యాధికారులు విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ నిబంధనలను పాటించే విధంగా ప్రైవేట్ చైతన్య స్కూల్ పై చర్యలు చేపట్టి ప్రైవేట్ చైతన్య స్కూల్ పై విచారణ జరిపి గుర్తింపు రద్దు చేయాలని డెమొక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ విద్యార్థి సంఘం ఉన్నత విద్యాధికారులకు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డి.ఎస్.ఎఫ్ నాయకులు కిరణ్ మోహన్ హరికృష్ణ విక్రమ్ తేజ తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుత న్న జిల్లా ఉపాధ్యక్షుడు ధనాపురం ఉదయ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *