ఆదోని పట్టణానికి త్రాగునీరు అందించే ఉద్దేశంతో 2002-2005 మధ్యలో నిర్మించిన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణంలో నాణ్యత లోపించిందని అందువల్లనే ఇప్పటికి మూడుసార్లు కట్ట కృంగిపోవడం జరిగిందని, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయ్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పీఎస్ రాధాకృష్ణ ఆరోపించారు. కుంగిపోయిన ఎస్ఎస్ ట్యాంకు కట్టను సిపిఎం ప్రతినిధి బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో మంచినీటి సమస్య పరిష్కారం కోసం, ఎస్ ఎస్ ట్యాంక్ నిర్మించాలని, సిపిఎం తోపాటు ఇతర రాజకీయ పార్టీలు, రెండు దశాబ్దాలుగా పోరాట ఫలితంగా, 2000 సంవత్సరంలో ఎస్ఎస్ ట్యాంక్ మొదలై 36 కోట్ల రూపాయలతో నిర్మించిన ఎస్ ఎస్ ట్యాంకు స్థాయిలో పట్టణ ప్రజల దాహార్తి పూర్తిస్థాయిలో తీర్చకముందే, ట్యాంకు కట్ట 2021లో రెండుసార్లు, ప్రస్తుతం 2023లో దాదాపు 100 మీటర్లు కట్ట కృంగిపోయినది ఇంకా 300 మీటర్లు కుంగి కూలిపోవడానికి సిద్ధంగా ఉందని దీనివల్ల కట్ట తెగిపోయే ప్రమాదం ఉందని తెలిపారు. ఎస్ ఎస్ ట్యాంక్ కట్ట నిర్మాణంలో స్లాబ్ పద్ధతి కాకుండా రాళ్లతో పేడ్చి కట్టాలని దానివల్ల 100 సంవత్సరాలైనా కట్టకు ఎటువంటి ప్రమాదం ఉండదని దీనికి ఉదాహరణ ఆదోని రాంజల్లా చెరువు అని తెలిపారు. ఎస్ ఎస్ ట్యాంక్ నిర్మాణం సందర్భంగా ఉన్న ఇంజనీర్, ప్రజాప్రతినిధి, కాంట్రాక్టర్ పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుందని, దీనిపై సమగ్ర విచారణ చేపట్టి, కారకులపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కట్ట కుంగిపోవడంతో నీటి నిలువలు చేసుకునే అవకాశం లేదని, దీనివల్ల ఆదోని పట్టణానికి త్రాగునీటి సమస్య తీవ్రమయ్యే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా పట్టణ కార్యదర్శి డి లక్ష్మన్న, మండల కార్యదర్శి లింగన్న, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ గోపాల్, ము, పట్టణ కమిటీ సభ్యులు నాగరాజు, వీరేష్, వెంకటేష్ పాల్గొన్నారు.


