కర్నూలు జిల్లా ఆదోని.. విద్యతోనే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడం సాధ్యమవుతుందని అందువల్ల ప్రతి ఒక్కరు విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చి తమ పిల్లలను ఉన్నత విద్యావంతులను చేయాలని ఆదోని స్పెషల్ సబ్ జైలు జైలర్ నజీర్ అహ్మద్ పిలుపునిచ్చారు. మంగళవారం 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పట్టణంలోని దుల్షా పైల్వాన్ మసీదు కమిటీ ప్రధాన ముతవల్లి షేక్ జక్రియ ఆధ్వర్యంలో దుల్షా పైల్వాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన జైలు సూపరింటెండెంట్ నజీర్ అహ్మద్ , జిల్లా వక్ఫ్ బోర్డ్ అధ్యక్షులు నియాజ్ అహ్మద్ లు జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆదోని సబ్ జైలు అధికారి నజీర్ అహ్మద్ మాట్లాడుతూ ఉన్నత విద్య తోనే అన్నింటా అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ముస్లిం మైనారిటీలు విద్యాపరంగా వెనకబడి ఉన్నారని అందువల్ల చదువుకు ప్రాధాన్యత ఇచ్చి తమ పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దాలని వక్ఫ్ బోర్డ్ చైర్మన్ నియాజ్ అహ్మద్ కోరారు. గత 20 సంవత్సరాల నుంచి మసీదు కమిటీ నిర్వహణ చేస్తున్నామని మసీద్ ఆధ్వర్యంలో మదరస నిర్వహిస్తూ నేడు ఇంగ్లీష్ మీడియం పాఠశాల కూడా ప్రారంభించామని త్వరలోనే ఉన్నత పాఠశాలను జూనియర్ కాలేజీలో కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నామని ఇందుకు అందరూ సహకరించాలని మసీదు కమిటీ ప్రధాన ట్రస్ట్ జక్రియ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ మహబూబ్బాషా, ఆదోని పట్టణం ఖతిబ్ సాబ్ జూనైద్ హాష్మి , న్యాయవాది నాసిర్ భాష, కమిటీ సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థిని, విద్యార్థులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


