◆ ఆగస్టు 14వ తేదీన దేశవ్యాప్తంగా జన జాగరణ కార్యక్రమం..
◆ బడా కార్పొరేటర్లకు కొమ్ముకాస్తున్న బిజెపి ప్రభుత్వం..
◆ మతతత్వ విధానాల ద్వారా ప్రజల్ని చీల్చి దేశాన్ని అధోగతి పాలు.. రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కే వెంకటేశులు
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రైతులను కూలీలను కార్మికులను విస్మరించి బడా కార్పొరేట్లకు కొమ్ముకాస్తూ, తన మతతత్వ విధానాల ద్వారా అన్ని వర్గాల ప్రజల్ని చీల్చి దేశాన్ని అధోగతి పాలు చేస్తున్నదని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కే వెంకటేశులు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కే లింగన్న తెలిపారు.
కర్నూలు జిల్లా ఆదోని సుందరయ్య భవన్లో శుక్రవారం మూడు సంఘాల సంయుక్త సమావేశం సిఐటియు మండల కార్యదర్శి బి వీరారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కే వెంకటేశులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కే లింగన్న మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం బడా కార్పొరేట్లకు కొమ్ముకాస్తూ, మతతత్వ విధానాల ద్వారా అన్ని వర్గాల ప్రజల్ని చీల్చి దేశాన్ని అధోగతి పాలు చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా రైతు సంఘం, సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆగస్టు 14వ తేదీన దేశవ్యాప్తంగా జన జాగరణ కార్యక్రమాన్ని గ్రామీణ ప్రాంతాల్లో చేపడుతున్నట్లు తెలిపారు. జన జాగరణ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.
ఈ సమావేశంలో రైతు సంఘం మండల కార్యదర్శి అయ్యప్ప, సిఐటియు మండల అధ్యక్షులు జే. రామాంజనేయులు, రైతు సంఘం మండల నాయకులు భాష, కౌలు రైతు సంఘం మండల కార్యదర్శి దస్తగిరి బాషా, ఆటో వర్కర్స్ యూనియన్ మండల కార్యదర్శి వీరేష్, కెవిపిఎస్ మండల నాయకులు పరమేష్, సిఐటియు నాయకులు ఉరుకుందు, ఏలియా తదితరులు పాల్గొన్నారు.