Day: September 3, 2024

వర్షంలో రోడ్డు పై నాట్లు వేసి నిరసన..

కర్నూలు జిల్లా ఆదోని మండలం గణేకల్లు గ్రామంలో చినుకు పడితే చిత్తడే చిత్తడి అని వర్షంలో రోడ్డు పై నాట్లు వేసి సిపిఎం పార్టీ నాయకులు, DYFI నాయకులు, గ్రామస్తులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మూడో వార్డులో 1982లో ఇంటి స్థలాలు ఇచ్చిన సిసి రోడ్లు వేయలేదని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వర్గ సభ్యులు బి. వీరారెడ్డి, డి. రామాంజనేయులు DYFI మండల నాయకులు చిరంజీవి అన్నారు. కొద్ది చిన్నపాటి వర్షం […]

పండగని పండగలా చేసుకుందాం.. ఎమ్మెల్యే పార్థసారథి

కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ కౌన్సిల్ హాల్లో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన పీస్ కమిటీ సమావేశానికి ముఖ్యఅతిథిగా డిఐజి ప్రవీణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మాట్లాడుతూ వినాయక నిమజ్జనం రోజు చెప్పిన సమయానికి కరెక్ట్ గా విగ్రహంలతో బైలుదేరాలని సూచించారు. పండగని పండగలా చేసుకుందాం ఎవరు లైను దాటోద్దు, అందరూ సంతోషంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం సిఐ శ్రీరాములు మాట్లాడుతూ వినాయక విగ్రహాలకు వెళ్ళడానికి రూట్ మ్యాప్ ఖరారు […]

ఆదోని నూతన సబ్ కలెక్టర్

కర్నూలు జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ పి.రంజిత్ బాషాకు పూల మొక్క అందజేసి మర్యాదపూర్వకంగా కలిసిన ఆదోని నూతన సబ్ కలెక్టర్ మంత్రి మౌర్య భరద్వాజ్..కడపలో అసిస్టెంట్ కలెక్టర్గా పనిచేసి ఎక్కడినుండి మొదటి పోస్టింగా ఆదోని సబ్ కలెక్టర్‌గా మంత్రి మౌర్య భరద్వాజ్ ఐఏఎస్. బుధవారం ఉదయం 9:30 గంటలకు ఆదోని లోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు సమాచారం..

ఆదోని వ్యవసాయ మార్కెట్లో 8 వేలకు పైన పలికిన పత్తి ధర

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 03-09-24 పత్తి అత్యధికంగా ₹. 8079/- రూపాయలు కనిష్ట ధర ₹. 4112/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 7399/- రూపాయలు కనిష్ట ధర ₹. 3409/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5693/- రూపాయలు కనిష్ట ధర ₹.4011/- రూపాయలు పలికింది. ఎండు మిరపకాయలు అత్యధికంగా ₹. 0/- రూపాయలు కనిష్ట ధర ₹. 0/- […]

ప్రజల కోసం ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నాన్న.. నూర్ అహ్మద్

ఆదోని ప్రజల కోసం ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నానని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి, ఆదోని జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు నూర్ అహ్మద్ అన్నారు.కర్నూలు జిల్లా ఆదోని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూఫారుఖ్ షుబ్లీ నిజమైన రాయలసీమ సేవకుడని, ఆయనను  అవమానించేలా కొందరు మాట్లాడటం సిగ్గు చేటని ఆవేదన వ్యక్తంచేశారు. ఎమ్మెల్యే పార్థ సారథి ఆదోని ఇమేజి దెబ్బతినేలా మాట్లాడవద్దని విజ్ఞప్తి చేస్తున్న. బిజెపి నాయకులు మల్లిక అవ్వ […]

శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద నీరు

శ్రీశైలం డ్యాం అధికారులు శుక్రవారం తేదీ 03.09.24 ఉదయం 7  గంటలకు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి. శ్రీశైలం డ్యాం 10 గేట్లు 20 అడుగులు మేర ఎత్తి దిగువ నాగార్జున సాగర్ కు నీరు విడుదల చేస్తున్న డ్యామ్ అధికారులుఇన్ ఫ్లో : 2,99,671 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 4,45,367 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటి మట్టం 885.00 అడుగులుప్రస్తుతం : 883.70 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 215.80706 టీఎంసీలుప్రస్తుతం : 208.2841 టీఎంసీలుకుడి,ఎడమ […]

తుంగభద్ర డ్యామ్ కు పెరుగుతున్న వరద నీరు

తుంగభద్ర జలాశయం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.తుంగభద్ర జలాశయనికి వచ్చి చేరుతున్న వరద నీరు ఇన్ ఫ్లో : 29907 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 15264 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1631.38 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం నీటి నిల్వ : 99.351 టీఎంసీలు

అదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్  ధరలు

ఆదోని 02 09 24: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 52/- రూపాయలు, రిటైల్: 1kg 54/- రూపాయలు

Back To Top