కర్నూలు జిల్లా ఆదోని మండలం గణేకల్లు గ్రామంలో చినుకు పడితే చిత్తడే చిత్తడి అని వర్షంలో రోడ్డు పై నాట్లు వేసి సిపిఎం పార్టీ నాయకులు, DYFI నాయకులు, గ్రామస్తులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మూడో వార్డులో 1982లో ఇంటి స్థలాలు ఇచ్చిన సిసి రోడ్లు వేయలేదని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వర్గ సభ్యులు బి. వీరారెడ్డి, డి. రామాంజనేయులు DYFI మండల నాయకులు చిరంజీవి అన్నారు. కొద్ది చిన్నపాటి వర్షం వచ్చిన మట్టి రోడ్డు పై వర్షపు నీరు పూర్తిగా నిలబడి జనాలు రాక పోకలకు తీవ్ర అంతరాయం కలిగి ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ముఖ్యంగా డ్రైనేజ్ కాలువ లేక సిసి రోడ్ల లేక కొన్నిచోట్ల వీధిలైట్లు లేక ఇబంధులు ఎదుర్కొంటున్నారని దానివల్ల విష పురుగులు కూడా వస్తున్నాయని, మురికి నీరు నిలబడినచోట బ్లీచింగ్ పౌడర్ కూడా వేయడం లేదని గతంలో సిపిఎం పార్టీగా సిసి రోడ్లు డ్రైనేజీలు వేయాలని సంతకాలు సేకరించడం గ్రామ సభలో అధికారుల దృష్టికి తీసుకుపోయిన అవార్డు వైపు ఏ అధికారులు కూడా కన్నెత్తి చూడడం లేదని ఆరోపించారు. కొత్త కాలనీ లొ ఇదే పరిస్థితి ఉందని ఈ రెండు ప్రాంతాలలో ఇంట్లో నుంచి బయటికి రాలేనటువంటి పరిస్థితి ఉందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి అక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ కాలువలు సిసి రోడ్లు వీధిలైట్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
ఈ కార్యక్రమం లో కాలనీ వాసులు బంగారయ్య వెంకటేషులు పెద్ద వీరేష్ బంగారుబాబు తదితరులు పాల్గోన్నారు.