రైలు కింద పడి మహిళ ఆత్మహత్యాయత్నం

కర్నూలు జిల్లా ఆదోని–ఇస్వి (ISVI) రైల్వే స్టేషన్ల మధ్య శనివారం తెల్లవారుజామున గుర్తుతెలియని మహిళ రైలు కింద పడి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… శనివారం (సెప్టెంబరు 19) తెల్లవారుజామున సుమారు 4:00 గంటల సమయంలో ఆదోని–ఇస్వి స్టేషన్ల మధ్య కిలోమీటర్ నంబర్ 495/18 డౌన్ లైన్ ట్రాక్‌పై సుమారు 40 ఏళ్ల వయస్సు గల గుర్తుతెలియని మహిళ ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్ (రైలు నం. 11302) కింద పడింది. ఈ ఘటనలో ఆమె ఎడమ మోకాలి కింది భాగం తీవ్రంగా తెగిపోయింది. గమనించిన రైల్వే సిబ్బంది వెంటనే 108 అంబులెన్స్ ద్వారా ఆమెను ఆదోని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.

ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళ

అక్కడ అత్యవసర చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆ మహిళ మృతి చెందినట్లు ఆసుపత్రి వైద్యాధికారులు ధ్రువీకరించారు. ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్ నుంచి అందిన ప్రాథమిక సమాచారంతో పాటు ఆదోని స్టేషన్ మాస్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు ఆదోని-మంత్రాలయం రైల్వే హెడ్ కానిస్టేబుల్ సి. శివరామయ్య తెలిపారు. మృతురాలి వివరాలు తెలిసిన వారు రైల్వే పోలీసులను సంప్రదించాలని కోరారు.