ప్రైవేట్ ఇంటర్మీడియట్ కళాశాలల పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి. డి.ఎస్.ఎఫ్ డిమాండ్.

కర్నూలు జిల్లా ఆదోని లో ప్రైవేట్ ఇంటర్మీడియట్ కళాశాలల పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి అని డి.ఎస్.ఎఫ్ విద్యార్థి సంఘం డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో DSF జిల్లా ఉపాధ్యక్షుడు ధనాపురం ఉదయ్ మాట్లాడుతూ ఆదోని డివిజన్ లో ప్రైవేట్ కార్పొరేట్ ఇంటర్మీడియట్ కళాశాలలో ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి అక్రమ అడ్మిషన్లు నిర్వహిస్తూ ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా ఫీజుల వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద దోపిడీ చేస్తూ అక్రమ అడ్మిషన్లు నిర్వహిస్తున్నారు. […]

నారా లోకేష్ NDTV తో ప్రత్యేక ఇంటర్వ్యూ

న్యూఢిల్లీ: నారా లోకేష్ NDTV తో ప్రత్యేక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాల కల్పన, అణగారిన వర్గాల అభ్యున్నతిపైనే పార్టీ దృష్టి సాధిస్తుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 16 లోక్‌సభ స్థానాలను గెలుచుకుంది మరియు ఎన్నికలలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) గెలుపులో కీలక పాత్ర పోషించింది. రాష్ట్రంలో ముస్లింలకు కల్పించిన రిజర్వేషన్లను తాము కొనసాగిస్తామని, ఈ విధానాన్ని తమ కూటమి భాగస్వామ్య పక్షమైన బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని లోకేష్ చెప్పారు.“ఇది (ముస్లింలకు రిజర్వేషన్) గత 2 […]

ఏపీకి రాజధాని అమరావతే నారా లోకేష్

విజయవాడ. అమరావతే ఏపీకి రాజధాని అని టీడీపీ నేత నారా లోకేష్ స్పష్టం చేశారు. ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ మరో ఆలోచన లేదని తెలిపారు. కొంతమేరకు 2014-19 మధ్య లో అమరావతి ని నిర్మించాం అని అంతేకాకుండా రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని కానీ 2019 లో వరకు అధికారం కోల్పోవడం వల్ల పూర్తి చేయలేక పోయాం అని తెలిపారు. ప్రస్తుతం అమరావతిని పునర్నిర్మించే పనిలో ఉన్నామని మూడు రాజధానుల ముచ్చట […]

ఆదోని అభివృద్ధి చేస్తా రాజ్ నాథ్ సింగ్

ఢిల్లీలో పర్యటిస్తున్న ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి మాజీ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ని మర్యాదపూర్వకంగా కలిసారు. ఎమ్మెల్యే పార్థసారథి ఎన్నికల సమయంలో ప్రచారం కోసం ఆదోని వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో ఆదోని అభివృద్ధికి మీ ఆశీస్సులు ఉండాలని కోరగా రాజ్ నాథ్ సింగ్ ఆదోని అభివృద్ధికి తప్పక సహాయం చేస్తానని ఎమ్మెల్యే పార్థసారధికి మాటిచ్చారు.

ఢిల్లీలో కేంద్ర నాయకులతో ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి బిజీ బిజీ

ఢిల్లీ – బిజెపి కేంద్ర కార్యాలయంలో ఆదివారం నరేంద్ర మోడీ మూడవసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారానికి చేస్తున్న ఏర్పాట్ల గురించి ప్రత్యేక సమావేశంలో నిర్వహించారు. ఈ సమావేశంలో ఆదోని ఎమ్మెల్యే పార్థసారధి పాల్గొన్నారు. బీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు , రాజ్యసభ సభ్యులు , బిజెపి పార్లమెంట్ బోర్డు సభ్యులు డాక్టర్ కే లక్ష్మణ్ ఢిల్లీ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. మాజీ కేంద్ర టెలి కమ్యూనికేషన్ శాఖ మంత్రి దేవాన్సు చౌహాన్ ను గుజరాత్ […]

ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావు ఇక లేరు

ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు(88) కన్నుమూశారు. కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. వెంటిలెటర్పై చికిత్స పొందుతూ తెల్లవారుజామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థీవదేహాన్ని రామోజీ ఫిల్మ్ సిటీకి తరలించారు.విలువలతో కూడిన జర్నలిజానికి పర్యాయ పదంగా, అంచెలంచెలుగా ఎదిగిన మీ ప్రస్థానం మరువలేనిది! జీవితాంతం ప్రజల పక్షాన అక్షరాన్ని నిలిపి..ప్రజా పరిరక్షనకు పాటుపడిన […]

ఆదోని అభివృద్ధికి సహకరించండి

కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గురువారం తెలుగుదేశం పార్టీ అధినేత కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాడేపల్లిగూడెం నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు. అధినేత చంద్రబాబు నాయుడుకి శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఆదోని అభివృద్ధికి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

ఇండియా కూటమి బాబుకు బంపర్ ఆఫర్

కేంద్రంలో బీజేపీకి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సరిపడ సీట్లు రాకపోవడంతో ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలోనే బిహార్‌లోని జేడీయూ అధినేత నితీష్ కుమార్, ఆంధ్రాలోని చంద్రబాబు మద్దతు ఎన్డీయేకు అనివార్యమైంది. ఈ క్రమంలోని ఇండియా కూటమి కూడా కేంద్రంలో ప్రభత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పావులు కదుపుతోంది. ఈ మేరకు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు తాయిలాలను చూపుతోంది. కాగా చంద్రబాబు నాయుడుకు డిప్యూటీ ప్రైమ్‌ మినిస్టర్‌ పదవి ఇస్తామంటూ […]

ఆదోనికి ఎమ్మెల్యే ఎవరు

ఆదోనికి ఎమ్మెల్యేగా ఎవరు..రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వస్తుంది..తమ అభిప్రాయాన్ని తెలిపిన ప్రజలు..ఇది నిజమవుతుందా? పబ్లిక్ జడ్జిమెంట్ న్యూస్ ఛానల్ చేసిన సర్వే పబ్లిక్ జడ్జిమెంట్ న్యూస్ ఛానల్ చేసిన సర్వేలో ఆదోని ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారని ప్రజల్ని వాట్సాప్ లో ఓటింగ్ నిర్వహిస్తే వైసీపీ అభ్యర్థి సాయి ప్రసాద్ రెడ్డి విజయం సాధిస్తారని 59.76% ఓటు వేశారు. టిడిపి కూటమి బిజెపి అభ్యర్థి పార్థసారథి కి 40.24% ఓటు వేసి తెలిపారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ […]

అదోనిలో భారీగా వాహనాలు సీజ్

కర్నూలు జిల్లా ఆదోని లో విజయనగర్ కాలనీ, కౌడల్ పేట, వాల్మీకి నగర్, బోయగిరి ఏరియాలలో రెండు రోజులుగా కార్డెన్ అండ్ సెర్చ్ ను నిర్వహించిన పోలీసులు. అందులో భాగంగా ఎటువంటి రికార్డ్స్ లేని 1 కారు, 6 ఆటోలు, 2 బొలెరో వాహనాలు, 76 మోటార్ సైకిలు 30 లీటర్స్ సారాయిని పోలీసులు సీజ్ చేశారు. కార్డెన్ అండ్ సెర్చ్ లో ఆదోని డీఎస్పీ శ్రీ J. శివ నారాయణస్వామి, ట్రైనింగ్ డిఎస్పి శ్రీధర్ ధీరజ్, […]

Back To Top