కర్నూలు జిల్లా ఆదోని లో ప్రైవేట్ ఇంటర్మీడియట్ కళాశాలల పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి అని డి.ఎస్.ఎఫ్ విద్యార్థి సంఘం డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో DSF జిల్లా ఉపాధ్యక్షుడు ధనాపురం ఉదయ్ మాట్లాడుతూ ఆదోని డివిజన్ లో ప్రైవేట్ కార్పొరేట్ ఇంటర్మీడియట్ కళాశాలలో ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి అక్రమ అడ్మిషన్లు నిర్వహిస్తూ ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా ఫీజుల వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద దోపిడీ చేస్తూ అక్రమ అడ్మిషన్లు నిర్వహిస్తున్నారు. ఇంత జరుగుతున్నా RIO ఏమి తెలియనట్లు వ్యవహరిస్తున్నరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్ కార్పొరేట్ ఇంటర్మీడియట్ కళాశాలపై తక్షణమే విజిట్ చేసి ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్న కళాశాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డి.ఎస్.ఎఫ్ విద్యార్థి సంఘంగా ఉన్నత విద్యాధికారులకు డిమాండ్ చేశారు. విద్యాధికారులు నిర్లక్ష్యం వహిస్తే కళాశాల ముందు ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో DSF నాయకులు కిరణ్, మోహన్, హరికృష్ణ, విక్రమ్, తేజ తదితరులు పాల్గొన్నారు.