ఢిల్లీలో పర్యటిస్తున్న ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి మాజీ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ని మర్యాదపూర్వకంగా కలిసారు. ఎమ్మెల్యే పార్థసారథి ఎన్నికల సమయంలో ప్రచారం కోసం ఆదోని వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో ఆదోని అభివృద్ధికి మీ ఆశీస్సులు ఉండాలని కోరగా రాజ్ నాథ్ సింగ్ ఆదోని అభివృద్ధికి తప్పక సహాయం చేస్తానని ఎమ్మెల్యే పార్థసారధికి మాటిచ్చారు.