విజయవాడ. అమరావతే ఏపీకి రాజధాని అని టీడీపీ నేత నారా లోకేష్ స్పష్టం చేశారు. ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ మరో ఆలోచన లేదని తెలిపారు. కొంతమేరకు 2014-19 మధ్య లో అమరావతి ని నిర్మించాం అని అంతేకాకుండా రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని కానీ 2019 లో వరకు అధికారం కోల్పోవడం వల్ల పూర్తి చేయలేక పోయాం అని తెలిపారు. ప్రస్తుతం అమరావతిని పునర్నిర్మించే పనిలో ఉన్నామని మూడు రాజధానుల ముచ్చట ఇక ముగిసినట్లే అని నారా లోకేష్ పేర్కొన్నారు.