ఆదోని 04 01 25: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 8/- రూపాయలు, రిటైల్: 1kg 10/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 28/- రూపాయలు, రిటైల్: 1kg 30/- రూపాయలు
ముగ్గురు రైతులకు తీవ్ర గాయాలు
కర్నూలు జిల్లా ఆదోని మండలం చిన్న పెండేకల్ గ్రామం పొలంలోని బోర్ లో పైపులు దింపుతుండగా సంభవించిన పేలుడు తో చంద్ర, పుష్పవతి, జైరామ్ ముగ్గురు రైతులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే చుట్టుపక్కల పొలాల వారు వారిని చికిత్స నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రగాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలించారు.
వేసవిలో త్రాగునీటి సమస్య లేకుండా ప్రణాళికలు సిద్ధం చేయండి.. ఆదోని సబ్ కలెక్టర్
వేసవిలో త్రాగునీటి సమస్య లేకుండా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పేర్కొన్నారు. మంగళవారం ఆదోని సబ్ కలెక్టర్ వారి కార్యాలయంలో ఆదోని డివిజన్ పరిధిలోని గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ అధికారులు, ఎంపీడీవో అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ వేసవిలో త్రాగునీటి సమస్యల తలెత్తుకుండగా చెరువులో నీటిని నిల్వ ఉంచుకోవడానికి ఏదైనా మరమ్మత్తులు ఉంటే వాటిని గుర్తించి వాటిని త్వరతగతిన పూర్తి చేయాలన్నారు. […]
జనవరి 5న కురువ వివాహ పరిచయ వేదిక
కర్నూలు జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఆవరణలోని మండల ప్రజాపరిషత్ సమావేశం భవనం లో జనవరి 5న ఆదివారం ఉదయం 10 గంటలకు కురువ, కురుబ, కురుమ కులస్థుల వివాహ పరిచయ వేదిక కరపత్రాన్ని కర్నూలు జిల్లా కురువ సంఘం జిల్లా అధ్యక్షులు పత్తికొండ శ్రీనివాసులు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. కె. రంగస్వామి, అసోసియేట్ అధ్యక్షులు గుడిసె శివన్న, ఆవిష్కరించారు. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు పత్తికొండ శ్రీనివాసులు మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని కులజులు తమ […]
మా సొంత భూములు మా పేరు ఆన్లైన్లో చేర్చండి
మా సొంత భూములు మా పేరు ఆన్లైన్లో చేర్చండి అని తాసిల్దార్ ముందు విన్నవించుకున్న రైతులు..కర్నూలు జిల్లా ఆదోని మండలం కుప్పగల్ గ్రామంలో తాసిల్దార్ శివ రాముడు రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో గ్రామంలోని 18 మంది రైతులకు చెందిన సుమారు 60 ఎకరాల భూమిని గత 100 సంవత్సరాలుగా సాగు చేస్తూ వస్తున్న భూములను రీ సర్వే సందర్భంగా రైల్వే భూములుగా ఆన్లైన్లో చేర్చడం అన్యాయమని తమ పేర్లను ఆన్లైన్ నుంచి తొలగించి రైల్వే […]
అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్
ఆదోని సబ్ డివిజన్ పరిధిలో పోలీసులు 95% ప్రాపర్టీ రికవరీ చేసినట్లు ఆదోని డీఎస్పీ సోమన్న తెలిపారు.కర్నూలు జిల్లా ఆదోని 1 టౌన్ పోలీసులు అంతర్ జిల్లా దొంగల ముఠాకు చెందిన గోవిందరాజులు, చిన్ని ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి వద్దనుండి సుమారు 6 లక్షల 40 వేల రూపాయల విలువచేసే 80 గ్రాముల బంగారు ఆభరణాలు, 1 లక్ష 76 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డిఎస్పి సోమన్న విలేకరులతో మాట్లాడుతూ ఆలూరు […]
పెంచిన విద్యుత్ చార్జీలపై వైఎస్ఆర్సిపి పోరుబాట
విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తామని అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికర్నూలు జిల్లా ఆదోనిలో విద్యుత్ చార్జీల బాదుడుపై మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సిపి కార్యాలయం నుండి విద్యుత్ కార్యాలయం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహిచి విద్యుత్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం ఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హరి మరియు డీయి పురుషోత్తంకు విద్యుత్ చార్జీలను […]
మన్మోహన్ సింగ్ మృతికి ఏడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన కేంద్రం..!
న్యూడిల్లీ : మన్మోహన్ సింగ్ మృతికి ఏడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన కేంద్రం..!అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోంశాఖ సమాచారం…ఏడు రోజులపాటు ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించవద్దని ఆదేశం…వారంపాటు వేడుకలు నిర్వహించకూడదని కేంద్ర హోంశాఖ ఆదేశం…జనవరి 1 వరకు జాతీయ జెండా అవనతం చేయాలని ఆదేశాలు…నేడు ఉదయం 11.00 గంటలకు భేటీకానున్న కేంద్ర కేబినెట్…మన్మోహన్ మృతికి సంతాపం తెలపనున్న కేంద్ర కేబినెట్.
ఆటో అదుపు తప్పడంతో బాలుడు మృతి
కర్నూలు జిల్లా ఆదోని మండలం గణేకల్ గ్రామసమీపంలో ఆటో అదుపు తప్పి బోల్తా పడడంతో అరవింద్ అనే ఆరేళ్ల బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. గణేకల్ గ్రామానికి చెందిన నాగవేణి రామాంజినేయులు దంపతుల కుమారుడు అరవింద్ తొ పాటు మేనమామ విరేష్ దైవ దర్శనానికి ఆటోలో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అరవింద్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి ప్రాంగణంలో కుటుంబ సభ్యులు రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి. మేనమామ విరేష్ తోపాటు […]
ఆదోని రైతు బజార్ లో టమాట కేజి ₹ 10 రూ.
ఆదోని 19 12 24: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 8/- రూపాయలు, రిటైల్: 1kg 10/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 36/- రూపాయలు, రిటైల్: 1kg 38/- రూపాయలు