విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తామని అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి
కర్నూలు జిల్లా ఆదోనిలో విద్యుత్ చార్జీల బాదుడుపై మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సిపి కార్యాలయం నుండి విద్యుత్ కార్యాలయం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహిచి విద్యుత్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం ఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హరి మరియు డీయి పురుషోత్తంకు విద్యుత్ చార్జీలను తగ్గించాలని డిమాండ్లతో కూడిన మెమోరాండం అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతులు వైఎస్ఆర్ సీపీ కౌన్సిలర్లు, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ మాట్లాడుతూ విద్యుత్ చార్జీలను తగ్గిస్తామని ప్రజలకు అబద్ధాలు చెప్పి ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల లోపే విద్యుత్ చార్జీలు పెంచి రైతులను ప్రజలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.