కర్నూలు జిల్లా ఆదోని మండలం గణేకల్ గ్రామసమీపంలో ఆటో అదుపు తప్పి బోల్తా పడడంతో అరవింద్ అనే ఆరేళ్ల బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. గణేకల్ గ్రామానికి చెందిన నాగవేణి రామాంజినేయులు దంపతుల కుమారుడు అరవింద్ తొ పాటు మేనమామ విరేష్ దైవ దర్శనానికి ఆటోలో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అరవింద్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి ప్రాంగణంలో కుటుంబ సభ్యులు రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి. మేనమామ విరేష్ తోపాటు సొంత బాబాయి రాజేష్  స్వల్ప గాయాలతో బయట పడరు. పెద్ద తుంబలం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై మహేష్ కుమార్ తెలిపారు.

ఆదోని గవర్నమెంట్ హాస్పిటల్ లో అరవింద్ (6)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *