వేసవిలో త్రాగునీటి సమస్య లేకుండా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పేర్కొన్నారు. మంగళవారం ఆదోని సబ్ కలెక్టర్ వారి కార్యాలయంలో ఆదోని డివిజన్ పరిధిలోని గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ అధికారులు, ఎంపీడీవో అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ వేసవిలో త్రాగునీటి సమస్యల తలెత్తుకుండగా చెరువులో నీటిని నిల్వ ఉంచుకోవడానికి ఏదైనా మరమ్మత్తులు ఉంటే వాటిని గుర్తించి వాటిని త్వరతగతిన పూర్తి చేయాలన్నారు. ప్రజలకు తాగునీటి అందించడంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. సిపిడబ్ల్యూఎస్ స్కీం కింద ఉన్న గ్రామాల్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ  చేస్తుండాలన్నారు. ఉన్న నీటిని పొదుపుగా వాడుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్డబ్ల్యూఎస్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పద్మజ, ఎంపీడీవోలు బంగారమ్మ, మనీ మంజలి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

అధికారులతో మాట్లాడుతున్న ఆదోని సబ్ కలెక్టర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *