Connect with us

News

మే 22 కలెక్టరేట్ ముందు ధర్నాను జయప్రదం చేయండి.. వ్యవసాయ కార్మిక సంఘం

Published

on

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్విరం చేసి ఉపాధి కూలీలకు దక్కకుండా చేయాలని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కుట్ర చేస్తుందని దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూలీలుగా మనందరి పైన ఉందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు లింగన్న తెలిపారు.

కర్నూలు జిల్లా ఆదోని మండలం జాలమంచి గ్రామంలో గురువారం ఉపాధి హామీ కూలీలతో సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కూలీలతో మాట్లాడుతూ రెండు పూటల పని విధానాన్ని మరియు ఆన్లైన్ మాస్టర్ విధానాన్ని రద్దు చేయాలని, పాత పద్ధతిలోని పనులు కొనసాగించాలని, పని దగ్గర నీళ్లు, నీడ టెంటు మెడికల్ కిట్లు, లాంటి సౌకర్యాలు కల్పించాలని, సమ్మర్ అలవెన్స్ 50% ఇవ్వాలని, గడ్డపార సాన పెట్టుకోవడానికి 50 రూపాయలు, 600 రూపాయలు వేతనం 200 రోజులు పని దినాలు కల్పించాలని డిమాండ్లపై మే 22న కలెక్టరేట్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు లింగన్న కూలీలకు పిలుపునిచ్చారు.

కూలీలకు పిలుపునిస్తున్న లింగన్న
Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

సూర్యుని చుట్టూ ఒక పెద్ద వృత్తాకార వలయం

Published

on

ఆదోని 23-06-2026 మధ్యాహ్నం 12 గంటలకు ఆకాశంలో సూర్యుని చుట్టూ ఏర్పడిన వలయం.. మీరు ఫోటోలో చూస్తున్నది ఒక అద్భుతమైన సహజ సిద్ధమైన ఖగోళ దృగ్విషయం. దీనిని సూర్య పరివేషం (Solar Halo) లేదా 22-డిగ్రీల హాలో (22° Halo) అని పిలుస్తారు. పాతకాలంలో దీనిని చూసి వర్షం పడే సూచనగా భావించేవారు, ఎందుకంటే ఈ రకమైన మేఘాలు సాధారణంగా వాతావరణంలో మార్పును లేదా వర్షాన్ని సూచిస్తాయి.

​ఇది ఎలా ఏర్పడుతుందో ఇక్కడ చూద్దాం:

  • మంచు స్ఫటికాలు (Ice Crystals): ఆకాశంలో చాలా ఎత్తులో ఉండే సిరస్ (Cirrus) మేఘాలలో మిలియన్ల కొద్దీ చిన్న చిన్న షడ్భుజి (hexagonal) ఆకారపు మంచు స్ఫటికాలు ఉంటాయి.
  • కాంతి వక్రీభవనం (Refraction): సూర్యకాంతి ఈ మంచు స్ఫటికాల గుండా ప్రయాణించినప్పుడు, అది వంగి (refract అయి) దాదాపు 22 డిగ్రీల కోణంలో విడిపోతుంది.
  • ఇంద్రధనస్సు లాంటి వలయం: ఇలా వక్రీభవనం చెందిన కాంతి సూర్యుని చుట్టూ ఒక పెద్ద వృత్తాకార వలయంలా (రింగ్ లా) మనకు కనిపిస్తుంది. దీని అంచులలో కొద్దిగా ఇంద్రధనస్సు రంగులు కూడా కనిపిస్తాయి.
యూట్యూబ్ వీడియో
Continue Reading

News

ఆదోని లో 10 లక్షల విలువైన 12 బైక్‌లు స్వాధీనం

Published

on

కర్నూలు జిల్లా ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మోటార్ సైకిల్లా దొంగ ముల్లా లతీఫ్ అనే వ్యక్తి అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 10 లక్షల విలువైన 12 బైకులు స్వాధీనం చేసుకున్నారు. టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. శుక్రవారం లక్ష్మమ్మ అవ్వ ఆర్చ్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానంతో హనవాలు గ్రామానికి చెందిన ముల్లా లతీఫ్ (31) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా ఆదోని, పత్తికొండ మరియు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 12 మోటార్ సైకిళ్లను దొంగిలించినట్లు విచారణలో తేలిందని తెలిపారు. ఆస్పరి కొత్త బైపాస్ రోడ్డు సమీపంలో రహస్యంగా దాచిన రూ. 10 లక్షల విలువైన 12 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితుడు  ముల్లా లతీఫ్ ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపారు.

Continue Reading

News

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

Published

on

కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవగల్ గ్రామ సమీపంలో బైకును లారీ ఢీ కోరడంతో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్తితి విషమంగా ఉంది. మృతుడు కౌతాళం మండలం కామవరం గ్రామానికి చెందిన ఈరప్పగా పోలీసులు గురించారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించరు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

మృతదేహాన్ని తరలిస్తున్న ఫోటో
Continue Reading
News6 hours ago

సూర్యుని చుట్టూ ఒక పెద్ద వృత్తాకార వలయం

News4 weeks ago

ఆదోని లో 10 లక్షల విలువైన 12 బైక్‌లు స్వాధీనం

News4 weeks ago

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

News1 month ago

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈవో!

News2 months ago

రైతులు వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై పొందవచ్చు: ఆదోని మండల వ్యవసాయ అధికారి

News2 months ago

రైతులు వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై పొందవచ్చు: ఆదోని మండల వ్యవసాయ అధికారి

News2 months ago

భార్యను పంపడం లేదని సెల్ టవర్ ఎక్కిన భర్త

News2 months ago

క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడితే పీడీ యాక్ట్: ఆదోని వన్ టౌన్ సీఐ హెచ్చరిక

News3 months ago

పాఠశాల పైకప్పు పెచ్చులు ఊడి విద్యార్థులకు తీవ్ర గాయాలు

News3 months ago

ఆస్తి కోసం తండ్రి పై కత్తి తో దాడి చేసిన వ్యక్తి అరెస్ట్

Trending