కర్నూలు జిల్లా ఆదోని పట్టణం లోని పరిశ్రామికవాడ నుంచి హనుమాన్ నగర్ వరకు 33 కెవి విద్యుత్తు లైను నిర్మాణం చేపడుతున్నందున శనివారం పట్టణంలోని హనుమాన్ నగర్, కిల్చిం పేట,బుద్దెకల్,వాల్మీకి నగర్, బోయగేరీ, సంతపేట, వడ్డేగేరి,చిన్న శక్తి గుడి,పెద్ద శక్తిగుడి, ఫారెస్ట్ లైన్, శుక్రవార్ పేటతో పాటు మరికొన్ని ప్రాంతాలల్లో ఉదయం గం 9 నుంచి మధ్యాహ్నం గం 2 వరకు విద్యుత్తు సరఫరా ఉండదని విద్యుత్తు శాఖ ఆదోని ఏడీఈ పురుషోత్తం తెలిపారు.విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించాలని ఆయన కోరారు
సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో నెల్లూరు జిల్లా కావలిలో పోలీసుల తీరుపై విమర్శలు వస్తున్నాయి..!! స్థానిక ఎమ్మెల్యే అవినీతిపై చర్యలు తీసుకోవాలంటూ భాజపా నేతలు సీఎం కాన్వాయ్‌కి ఎదురెళ్లి నిరసనకు యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు..!! ఈ క్రమంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఓ భాజపా నేతను పోలీసు అధికారి తన రెండు కాళ్ల మధ్య ఉంచి నిలువరించే ప్రయత్నం చేయడం వివాదాస్పదమైంది..!!
ఆరోగ్యశ్రీలో లేక వైద్యం కోసం ఖర్చుపెట్టి ఇబ్బంది పడుతున్న పేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ప్రజలకు అండగా నిలిచిన వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి తెలిపారు కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో ఐదు మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 10 లక్షల 20 వేల రూపాయలు చెక్కులను ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అందజేశారు. కార్వాన్ పేట్ వీధి కి చెందిన నరసింహులు 4 లక్షల 20 వేల రూపాయలు, బోయగిరి వీధి కి చెందిన వి. చంద్ర లివర్ చడిపోయి చికిత్స పొందుతూ మృతి చెందినడు అతని కుటుంబానికి 3 లక్షల 20 వేల రూపాయలు, మరాఠీ గేరికి చెందిన చాంద్ బాషా అనే వ్యక్తి 1 లక్ష 20 వేలు, పెద్ద హరివాణం గ్రామానికి చెందిన బెంజి గర్జన్నకు 20వేల రూపాయలు, పెద్ద తుంబలం గ్రామానికి చెందిన గంజాల రంగమ్మ కు 1 లక్ష 40 వేల రూపాయలు వైద్య ఖర్చులకు గా సీఎం రిలీఫ్ ద్వారా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి చెక్కులను అందజేశారు.
నరసింహులు కు చెక్కును అందజేస్తున్న ఎమ్మెల్యే
చంద్ర కుటుంబానికి చెక్కును అందజేస్తున్న ఎమ్మెల్యే
చెక్కును అందజేస్తున్న ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి
ఆదోని త్రీటౌన్ సిఐగా బాధ్యతలు స్వీకరించిన పి. నరసింహ రాజు. ఆదోని త్రీటౌన్ సిఐగా విధులు నిర్వహిస్తున్న సీఐ శ్రీరాములు కర్నూలు విఆర్ బదిలీ చేసినట్లు శుక్రవారం ఉత్తర్వులు . పి నరసింహ రాజు సీఐగా బాధ్యతలు స్వీకరించారు.