కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో శుక్రవారం ఆర్యవైశ్య అఫీషియల్ మరియు ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు శ్రీనివాస గుప్తా, ప్రతాప్ ఈరన్న శెట్టి, ఉపాధ్యక్షులు మిరియాల శ్రీధర్ కార్యదర్శి మరియు నాగేష్ కాకుబాల్ ( ఎన్ ఆర్ ఐ ) మాట్లాడుతూ జూన్ 3 తేదీ శనివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పూల బజార్ వాసవి కళ్యాణ మండపంలో ఉచిత కంటి ఆపరేషన్ల మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆదోని పట్టణ మరియు గ్రామీణ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కంటి పరీక్షలు పిల్లలు పెద్దలు వృద్ధులందరికీ ఉచితంగా కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి శుక్ల ఆపరేషన్ కళ్ళకు అత్యాధునిక లెన్స్ కూడా ఉచితంగా అమర్చి కంటి బాధితులకు ఉచిత వసతి భోజనం వసతి ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఆదోని నుండి కర్నూలు మరియు కర్నూలు నుండి అదోనికి వచ్చేవరకు రవాణా సౌకర్యం కల్పించబడునని అలాగే ఆపరేషన్ చేయించుకునెవారు తమ వెంట ఒరిజినల్ ఆధార్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డు తెల్ల రేషన్ కార్డ్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోలు వారి యొక్క సెల్ ఫోన్ నెంబర్ తమ వెంట తప్పకుండా తీసుకొని రావాలని విజ్ఞప్తి చేశారు. వైద్య పరీక్షలు ఆపరేషన్లు మందులు ఇవ్వబడునని తెలిపారు. ఈ సమావేశంలో సంగీత, ప్రతాప్ హిమబిందు, వంగదారి గీత, రంగనాయకులు తదితరులు పాల్గొన్నారు.
కర్నూలు జిల్లా ఆదోని పత్తికొండ రోడ్డు బాట మారెమ్మ గుడి సమీపంలో ఉల్లిగడ్డల లారీ అదుపుతప్పి బోల్తా పడింది. డ్రైవర్ ఇచ్చిన వివరాల మేరకు గుల్బర్గా నుంచి ఉల్లిగడ్డలు వేసుకొని వెళ్తుండగా ఆటో సడన్గా అడ్డం రావడంతో అదుపుతప్పి టైర్ పగిలి కింద పడిందని అయితే డ్రైవర్కి, క్లీనర్కి ఎటువంటి గాయాలు కాలేదు అని తెలిపారు.
ఆస్పరి రోడ్లో అదుపుతప్పి బోల్తా పడిన ఉల్లిగడ్డల లారీ
కర్నూలు జిల్లా ఆదోని పట్టణం బావాజీ పేటలో శుక్రవారం సెబ్ పోలీసులు దాడులు నిర్వహించరు. ఈ దాడులలో బోయ గుంటమ్మ ను అరెస్ట్ చేసి ఆమె వద్ద నుండి 144 ఓసి డీలక్స్ విస్కీ కర్ణాటక మద్యం ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఆమెను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ దాడులలో సేబ్ ఇన్స్పెక్టర్ హరి కృష్ణ, SI లు శివ ప్రసాద్, మధు సుడన రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
■ ఉద్యోగం కోసం ఎదురుచుస్తున్నవారికి SIMHO HR Services వారి గొప్ప అవకాశం ■ కేవలం “మహిళలు మాత్రమే” పనిచేసే ప్రదేశం లో మహిళల కోసం ప్రత్యెక ఉద్యోగ అవకాశాలు
కనీసం పదవతరగతి వరకు చదివి వయసు 18 నుండి 25 సంవత్సరాల మధ్యగల మహిళలకు చిత్తూరు జిల్లా శ్రీ సిటీలో ఉద్యోగ అవకాశాలు పనిచేసే చోటు విడియోల కొరకు క్రింద ఇచ్చిన లింక్ ను చుడండి.
youTube video
ఉద్యోగ వివరాలు : కంపెనీ : స్మార్ట్ మొబైల్ తయారి కంపెనీ పోస్ట్ : ప్రొడక్షన్ ఆపరేటర్ విద్యార్హతలు: 10th లేదా ఆపైన వయస్సు : 18 నుండి 26లోపు unMarried జీతం : Rs.13,740/- షిఫ్ట్ లు : 3 రొటేషన్ షిఫ్ట్ లు కలవు. పని గంటలు: 8 గంటలు నెలలో 26 రోజులు పని , నాలుగు రోజులు సెలవు పనిచేయు స్థలం : చిత్తూరు సదుపాయాలు : ఉచిత రవాణా, కాంటీన్, పి.ఫ్., ఇ.యస్.ఐ. సదుపాయలు మీ పూర్తీ వివరాలను ఈ లింక్ ద్వారా పంపిచండి
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కందనాతీ గ్రామంలో ప్రధానమంత్రి కృషి సంచాయీ యోజన మరియు వాటర్ షేడ్ డెవలప్మెంట్ వారి ఆధ్వర్యంలో ఉత్పాదకత పెంపుదల (PSI) కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ రైతులకు పనిముట్లు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ డా.జి.సృజన
సభను ఉద్దేశించి మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ డా.జి.సృజనసభా ప్రాంగణంలో కూర్చున్న రైతులువ్యవసాయ రైతులకు పనిముట్లు పంపిణీ చేస్తున్న జిల్లా కలెక్టర్ డా.జి.సృజన
◆ 30 సంవత్సరాలుగా కోర్టులో పెండింగ్లో ఉన్న పెద్ద చెరువు.. ◆ సమస్య ను పరిష్కరించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు… ◆ సమస్య పరిష్కరించకపోతే ఆమరణ నిరాహార దీక్షలు కూడా చేపడతామ్.. సిపిఎం పార్టీ.
కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవుగల్ గ్రామంలో 30 సంవత్సరాలుగా కోర్టులో పెండింగ్లో ఉన్న పాండవగల్ పెద్ద చెరువు సమస్యను పరిష్కరించాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో 26, 27, 28, తేదీల్లో గ్రామస్తులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. శుక్రవారం దీక్షలను ప్రారంభిస్తూ సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె.వెంకటేశులు, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కే లింగన్న, మాట్లాడుతూ ప్రభుత్వము కోర్టులో ఉందనే సాగుతో పెద్ద చెరువు సమస్య నిర్లక్ష్యం చేస్తున్నదని, గత 30 సంవత్సరాలుగా ఈ చెరువు సమస్య పరిష్కారం కోసం సిపిఎం పార్టీ పోరాడుతూనే ఉందని పరిష్కారం అయ్యేంతవరకు పోరాటం కొనసాగుతుందని వారు తెలిపారు. సబ్ కోర్టు, జిల్లా స్థాయి కోర్టు, హైకోర్టులో కూడా ప్రభుత్వ చేరువని తీర్పులు వెలువడినప్పటికీ స్వాధీనం చేసుకోవడంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం కారణంగా ఆక్రమణదారు విజయలక్ష్మి అప్పిల్ కు వెళ్లడం జరిగిందని, ఇప్పటికే ఎన్నో కేసులు కూడా గ్రామస్తులు భరించారని అన్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి చెరువు సమస్యను పరిష్కరించాలని లేనిపక్షంలో ఆమరణ నిరాహార దీక్షలు కూడా చేపడతామని వారు తెలిపారు. నిరాహార దీక్షలో సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు జే. రామాంజనేయులు, సిపిఎం పార్టీ శాఖ కార్యదర్శిలు గోవిందు, అనీఫ్ బాషా, సిపిఎం పార్టీ శాఖ సభ్యులు కే నర్సిరెడ్డి, డిజే నర్సిరెడ్డి, కే హనుమంత రెడ్డి, యు. హనుమంత రెడ్డి, వై తాయన్న, యు. తాయప్ప, ఎస్ శిక్షావల్లి దీక్షలో కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ శాఖ కార్యదర్శి పాండురంగ శాఖ సభ్యులు కృష్ణ భాష మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
దీక్షలకు మద్దతుగా సిపిఎం పార్టీ మండల నాయకులు హనుమంతరెడ్డి, రైతు సంఘం మండల అధ్యక్షులు శేఖర్, పార్టీ నాయకులు వెంకటేష్, సిఐటియు ఆటో యూనియన్ నాయకులు వీరేశ్, ఉరుకుందు, డివైఎఫ్ఐ మండల అధ్యక్షులు శ్రీకృష్ణ ఉపాధ్యక్షులు చిరంజీవి మరియు రమేష్ పాల్గొన్నారు.
దీక్షా శిబిరం వద్ద మాట్లాడు సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కే. లింగన్న
దీక్ష శిబిరం వద్ద మాట్లాడుతున్న సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె.వెంకటేశులు