ఆదోని: స్థానిక జాతీయ వ్యవసాయ మార్కెట్ (e-NAM) లో శుక్రవారం (20-11-2026) వివిధ వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు జోరుగా సాగాయి. మార్కెట్కు మొత్తం 591 లాట్లు, 2122 సంచులు (4007 క్వింటాళ్లు) సరుకు అమ్మకానికి వచ్చింది.

ధరల వివరాలు (క్వింటాకు రూపాయల్లో): పత్తి (Cotton): 522 లాట్లలో 1262 సంచులు (3687 క్వింటాళ్లు) రాగా, కనిష్ఠ ధర రూ. 4950-00, మధ్య ధర రూ. 9129-00 మరియు గరిష్ఠ ధర రూ. 9489-00 పలికింది.

వేరుశనగ (Groundnuts): 55 లాట్లలో 739 సంచులు (259 క్వింటాళ్లు) రాగా, కనిష్ఠ ధర రూ. 4799-00, మధ్య ధర రూ. 7846-00 కాగా గరిష్ఠ ధర రూ. 10150-00 నమోదైంది.

ఆముదాలు (Castor seeds): 14 లాట్లలో, 121 సంచులు (61 క్వింటాళ్లు) మార్కెట్కు రాగా, కనిష్ఠ ధర రూ. 7464-00, మధ్య ధర రూ. 7728-00 మరియు గరిష్ఠ ధర రూ. 7749-00 గా నమోదైనట్లు మార్కెట్ అధికారులు తెలిపారు
