రాత్రికి రాత్రే పంట కోసి ఎత్తుకెళ్లిన దుండగులు

కష్టపడి సాగు చేసిన పంట చేతికొచ్చిన వేళ, అన్నదాతకు తీరని అన్యాయం జరిగింది. కంటికి రెప్పలా కాపాడుకున్న మిరప పంటను రాత్రికి రాత్రే గుర్తుతెలియని దుండగులు కోసి ఎత్తుకెళ్లిన ఘటన కర్నూలు జిల్లా ఆదోని మండలం ధనపురం గ్రామంలో తీవ్ర కలకలం రేపింది. బాధిత రైతు తెలిపిన వివరాల మేరకు.. ధనపురం గ్రామానికి చెందిన బాషా అనే రైతు తనకున్న రెండున్నర ఎకరాల పొలంలో భారీగా పెట్టుబడి పెట్టి బ్యాడిగి రకం మిరప పంటను సాగు చేశారు. … Read more

నిషేధిత బాణసంచా విక్రయిస్తే కఠిన చర్యలు: ఆదోని ఆర్డీవో

ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిషేధిత క్రాకర్స్ విక్రయిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆదోని ఆర్డీవో అరుణ దేవి హెచ్చరించారు. ఆదివారం కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ మైదానంలో ఏర్పాటు చేసిన బాణసంచా దుకాణాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. వ్యాపారుల అనుమతి పత్రాలు, అగ్నిప్రమాద నివారణ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ.. కేవలం అనుమతించిన బాణసంచాను మాత్రమే విక్రయించాలని, దుకాణాల వద్ద అగ్నిమాపక భద్రతా పరికరాలు తప్పనిసరిగా ఉంచుకోవాలని స్పష్టం చేశారు. దుకాణాల … Read more

ఆదోని వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ, ఎంపీటీసీలకు ఘన సన్మానం

2029లో జగన్‌ను మళ్లీ సీఎం చేయడమే లక్ష్యం ◆ కూటమి పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత: మాజీ ఎమ్మెల్యే వై. సాయిప్రసాద్ రెడ్డి ◆ రాష్ట్రంలో కొనసాగుతున్న టీడీపీ కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందని, స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమని వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే వై. సాయిప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. కర్నూలు జిల్లా ఆదోని మండల పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున ఘన విజయం సాధించిన జడ్పీటీసీ సభ్యుడు … Read more