కర్నూలు జిల్లా అడిషనల్ ఎస్పీ కృష్ణ కాంత్ పటేల్ ఆదేశాల మేరకు ఆదోని మండలంలో సెబ్ పోలీస్ వేరువేరు ప్రాంతాలలో దాడులు నిర్వహించి అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్న 5 మంది LLC కెనాల్ వద్ధ బాధినేహాల్ గ్రామానికి చెందిన M. నాగప్ప, పెద్ద హరివానం చెక్ పోస్ట్ వద్ద సిరుగుప్పకు చెందిన విజయ్, అనిల్, మాదిరే గ్రామానికి చెందిన వీరేష్ మరియు ఉసేనప్ప లను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 24 కర్ణాటక మద్యం బాక్సులను మరియు మూడు మోటార్ సైకిల్ లను స్వాధీనం చేసుకున్నారు. సబ్ పోలీసులు వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించారు.
ఈ దాడులలో ఆదోని సెబ్ సిఐ హరికృష్ణ, ఎస్ఐ శివ ప్రసాద్ మరియు పెద్ద హరివణం చెక్ పోస్ట్ సిఐ మంజుల ఎస్ఐ కమలాకర్ సిబ్బంది సోమేష్, సుధాకర్ తదతరులు పాల్గొన్నారు.