కర్నూలు జిల్లా ఆదోని ఆర్ట్స్ సైన్స్ కాలేజ్ లో అండర్ 17 గర్ల్స్ విద్యార్థినిలకు కబడ్డీ క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంపు నవంబర్ 17వ తేదీన 22వ తేదీ వరకు నిర్వహించారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లి లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లాలోని వివిధ మండలాల నుంచి 12 మంది విద్యార్థినిలకు కోచ్ పి.ఇ. టి రమన్న, టీమ్ మేనేజర్ హరిత, పి.ఇ. టి నరసింహులు, పి.ఇ. టి గంగాధర్ శిక్షణ అందించారు. కోచ్ రామన్న తెలిపిన వివరాల మేరకు కర్నూలు జిల్లాలోని కర్నూలు, బనగానపల్లె, డోన్, పల్లెపాడు, పెద్ద హరివానం మండలాల నుంచి 12 మంది విద్యార్థినిలు శిక్షణ పొందుతున్నారని తెలిపారు. గత సంవత్సరం అండర్ 14 గర్ల్స్ క్యాంపు నిర్వహించి నగరిలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించారని అందువల్ల ఈ సంవత్సరం అండర్ 17 గర్ల్స్ క్యాంప్ నిర్వహిస్తున్నామని విద్యార్థినీలు శిక్షణ పూర్తి అయిన తర్వాత చౌడేపల్లి లో జరిగే రాష్ట్రస్థాయి మహిళ కబడి పోటీలలో పాల్గొంటారని తెలిపారు. శిక్షణ కోసం గ్రౌండ్ ఇచ్చిన ఆర్ట్స్ కాలేజ్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.

క్యాంప్లో పాల్గొన్న విద్యార్థినిల గ్రూప్ ఫోటో
యూట్యూబ్ వీడియో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *