కర్నూల్ నగరం కేవీర్ కాలేజీ నందు వైస్సార్సీపీ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో why ap needs jagan (ఆంధ్రప్రదేశ్ కి జగన్ ఎందుకు కావాలిఅంటే ) కార్యక్రమానికి ఎంపీ సంజీవ్ కుమార్, అసెంబ్లీ అబ్జర్వర్, కర్నూల్ జిల్లా JCS కో ఆర్డినేటర్ తెర్నకల్ సురేంద్రరెడ్డి, వై ఎస్ ఆర్ సి పి స్టూడెంట్ యూనియన్ రెడ్డీపోగు ప్రశాంత్, మణిరెడ్డి పాల్గొన్నారు.
అనంతరం తెర్నకల్ సురేంద్రరెడ్డి మాట్లాడుతు సీఎం వైస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వై ఏపీ నీడ్స్ జగన్ ఏపీ కి జగన్ ఎందుకు కావాలంటే ప్రజలకు, విద్యార్థి, విద్యార్నీలకు సీఎం జగనన్న నవరత్నాలలో భాగంగా ప్రవేశ పెట్టిన వివిధ సంక్షేమ పథకాల ద్వారా విద్యార్థి, విద్యార్థినిలకు జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన, ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీ అలాగే పరోక్ష ప్రయోజనాల బదిలీ లబ్ది చేకూర్చే విధంగా మన ప్రభుత్వం పాలన సాగిందన్నారు.
పేదలకు సంక్షేమ పథకాలు అందించడంలో ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా పూర్తి పారదర్శకంగా, కుల, మత, ప్రాంత, వర్గ, పార్టీ తేడా లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని తెలిపారు. “ఆంధ్రప్రదేశ్ కి జగనే మళ్ళీ కావాలంటూ”, మా నమ్మకం నువ్వే జగనన్న అంటూ విద్యార్థులలో జోష్ నింపారు.