కర్నూలు జిల్లా ఆదోని పట్టణం హవనపేట వీధి లో ఉన్న వెంకట నర్సప్ప ఆలయ ప్రాంగణంలో భారీ రావిచెట్టు సోమవారం ఉదయం సుమారు 7:30 గంటలకు ఒక్కసారిగా నేలకొరిగింది. ఉదయం వేళ రాకపోకలు తక్కువగా ఉండటంతో పెను ప్రమాదం తప్పినట్లు స్థానికులు తెలిపారు. చెట్టు కొమ్మలు ఇద్దరు వ్యక్తులకు సులభంగా గాయాలైనట్లు తగిలినట్లు స్థానికులు వెల్లడించారు. అయితే ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదని సమాచారం. భారీ చెట్టు కూలిపోవడంతో సమీపంలోని విద్యుత్ వైర్లు తెగి రోడ్డుపై పడిపోయాయి. దీంతో కొంతసేపు స్థానికులు అప్రమత్తమై ఆ ప్రాంతంలో రాకపోకలను నిలిపివేశారు. అనంతరం సంబంధిత అధికారులు, విద్యుత్ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు.

నేలకొరిగిన రావి చెట్టు
దెబ్బతిన్న వాహనాలు
చెట్టును నేలకొరకడంతో చూస్తున్న స్థానికులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *