హీరో నాగార్జునకు సంబంధించిన నాగ్ కన్వెన్షన్ హాల్ కూల్చివేస్తుంది హైడ్రా..
హైదరాబాదులో శనివారం ఉదయం హీరో నాగార్జున కు సంబంధించిన N కన్వెన్షన్ ను కూల్చివేస్తుంది హైడ్రా..
భారీ పోలీసుల బందోబస్తు మధ్య కూల్చివేతలు పనులు చేపట్టారు అధికారులు.
తమడికుంట సంబందించిన బఫర్లొ ఎన్ కన్వెన్షన్ నిర్మాణాలను చేపట్టారని అనేక ఫిర్యాదులు రావడంతో అధికారులు కూల్చివేతలు జరుపుతున్నారు .
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా.. ప్రభుత్వ స్థలలో, చెరువులు, కుంటలు, నాలాల స్థలాల్లో అక్రమంగా నిర్మించిన కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. అయితే గతంలో హాట్ టాపిక్‌గా మారిన ఎన్ కన్వెన్షన్( నాగ్ కన్వెన్షన్ హాల్) వివాదం మరోసారి తెర మీదకు వచ్చింది. గత ప్రభుత్వ హయాంలో ఈ కట్టడం అక్రమంగా జరిగిందని, చెరువు భూమిని కబ్జా చేసి వార్తలు వచ్చాయి. అయితే తాజాగా హైడ్రా అక్రమ కట్టడాలపై విరుచుకు పడుతుండటంతో.. తమడికుంట చెరువును కబ్జా చేసి.. ఎన్ కన్వెన్షన్ నిర్మించారనిK హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు జనం కోసం సంస్థ ప్రతినిధి భాస్కర్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో తమడికుంట చెరువులోని 3.30 ఎకరాల స్థలంలో ఎన్ కన్వెన్షన్ కబ్జా చేసి కన్వెన్షన్ హాల్ నిర్మించారని.. ఈ అక్రమ కట్టడాలపై హైడ్రా చర్యలు తీసుకుని.. తమడికుంట చెరువుకు పూర్వవైభవం తీసుకురావాలని.. తన ఫిర్యాదులో రాసుకొచ్చారు. దీంతో డాక్యూమెంట్స్ పరిశీలించి.. ఆక్రమించిన స్థలాల్లో కట్టిన కన్వెన్షన్ నిర్మాణాన్ని కూల్చి వేస్తున్నారు