రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామ సభలను అధికారులు నిర్వహించారు.
కర్నూలు జిల్లా ఆదోని మండలంలో పెద్ద తుంబలం, కుప్పగల్లు, బల్లేకల్లు, పాండవగల్లు, గణేకల్లు, హానవాళ్, జాలిమంచి, దొడ్డనకేరి, కొత్తూరు, మాంత్రికి గ్రామాలలో నిర్వహించిన గ్రామసభలో ఉపాధిహామీ పథకంలో కొత్త పనులతో పాటు పాత పనులు గుర్తించాలని, గ్రామ సభలో తీర్మానం చేయాలని కోరుతూ వినతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కే. లింగన్న, సంఘం మండల అధ్యక్షులు G. రంగనాథ్, రైతు సంఘం మండల అధ్యక్షులు శేఖర్, సిఐటియు మండల కార్యదర్శి బి వీరారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు గోవిందు, పాండురంగ, ఈరన్న, దాసప్ప, అబ్దుల్ రహీం, కర్ణ, చందప్ప, ఉపాధి హామీ మెటీలు చిదానంద, లక్ష్మన్న, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *