పెంచిన కరెంటు చార్జీలు తగ్గించాలి. సిపిఎం..

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కస్టమర్ చార్జీలు, ట్రూ అప్ చార్జీలు, సర్చార్జీలు, విద్యుత్ సుంకం పేరుతో దాదాపు ఏడు రకాలుగా దొడ్డిదారిన కరెంటు చార్జీలు వసూలు చేస్తుందని, కావున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీన్ని విరమించుకొని కరెంటు చార్జీలు తగ్గించాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవుగల్ గ్రామంలో ప్రజలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి కే లింగన్న మాట్లాడుతూ ఒక్కో ఇంటికి కనీసం 200 నుండి 500 రూపాయలు వరకు కరెంటు బిల్లు వచ్చిందని ఇదే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తే వచ్చే నెలలో కరెంట్ బిల్లులు కట్టేది లేదని తెగేసి చెప్పారు. అలాగే 2000 సంవత్సరంలో జరిగిన విద్యుత్ పోరాటం తరహాలోని మరో పోరాటానికి సిపిఎం పార్టీ సిద్ధమవుతుందని ఆయన హెచ్చరించారు. ఈ మధ్యనే వామపక్షాల ఆధ్వర్యంలో ఒక సదస్సు జరిగిందని, 10 వామపక్ష పార్టీలు కలిసి జూన్ 30వ తేదీన పెద్ద ఎత్తున విద్యుత్తు కార్యాలయాల దగ్గర ఆందోళన పిలిపిచ్చారు. ఈ కరెంటు చార్జీల భారాలకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ మరియు వామపక్షాలు నిర్వహించే పోరాటంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ శాఖ కార్యదర్శి కే పాండురంగ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

అధిక చార్జీలు వేసిన కరెంట్ బిల్లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Exit mobile version