Day: June 23, 2023

విద్యుత్ సరఫరాలో అంతరాయం….

కర్నూలు జిల్లా అదోని లో శనివారం 24వ తేదీ ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు విద్యుత్ సరఫరా లో అంతరాయం ఉంటుందని ఏడి ఈ చంద్రశేఖర్ శుక్రవారం తెలిపారు. ఈ విషయాన్ని విద్యుత్ వినియోగదారులు గమనించి తమ సంస్థకు సహకరించాలని ఆయన కోరారు.

తాగితే మనుషులు మృగాలవుతారా

◆ తాగితే మనుషులు మృగాలవుతారనడానికి ఇదొక నిదర్శనం..◆ తాగినప్పుడు స్నేహితులు బంధువులు ఎవరూ కనబడరని రాక్షసుడు అవుతారని తెలిపేదే ఈ ఘటన..కర్నూలు జిల్లా అదోనిలో 19వ తేదీ తాగిన మత్తులో శంకర్ అనే వ్యక్తి హత్య కేసును 3టౌన్ పోలీసులు ఛేదించారు. నలుగురు ముదాయులు రామలింగడు, జగన్నాథ్ రెడ్డి, జయరామి రెడ్డి, రామకృష్ణ లను అరెస్ట్ చేసి డిఎస్పి ముందు హాజరు పరిచరు. ఈ సందర్భంగా డిఎస్పి శివ నారాయణ స్వామి మాట్లాడుతూ ఈ కేసులో సీసీ […]

నవోదయ నోటిఫికేషన్ విడుదల

దేశంలో ఉన్న జవహర్ నవోదయ విద్యాసంస్థల్లో 2024-25 విద్యాసంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. https://cbseitms.nic.in/ వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి.విద్యార్థులు మే 1 2012 నుండి జులై 7, 2014 మధ్య జన్మించి ఉండాలి. ఆయా జిల్లాల్లోని స్కూళ్లలో 2023-24 విద్యాసంవత్సరంలో ఆరో తరగతి చదువుతూ ఉండాలి. దరఖాస్తులకు చివరి తేదీ ఆగస్టు 10, 2023 అని నోటిఫికేషన్ లో తెలిపారు.

ఆదోని అభివృద్ధి ధ్యేయంగా అడుగులు వేస్తున్న యువనేత జయ మనోజ్ రెడ్డి

ఆదోని అభివృద్ధి ధ్యేయంగా అడుగులు వేస్తున్న యువనేత జయ మనోజ్ రెడ్డికర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఎమ్మెల్యే ఆదేశాల మేరకు గతంలో హామీ ఇచ్చిన ప్రకారంగానే 31 వ వార్డు ఇన్చార్జి రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో రూ.10లక్షల 50 వేల తో నూతన డ్రైనేజీ నిర్మాణం పనులకు భూమి పూజ చేసిన పనులను ప్రారంభించారు యువనేత జయ మనోజ్ రెడ్డి. పూర్తిగా వార్డులో సమస్య పరిష్కరిస్తున్నామని తెలిపారు.

Back To Top
Exit mobile version