కర్నూలు జిల్లా ఆదోని రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే పట్టాలపై గుర్తు తెలియని మహిళ ఆత్మహత్య తీసుకుంది. రైల్వే పోలీసులు ఇచ్చిన వివరాల మేరకు తెల్ల వారు జామున గుర్తు తెలియని మహిళా వయస్సు సుమారు 40 సం.,లు ఆదోని యార్డ్ లోని డౌన్ లైన్ ట్రాక్ KM NO 494/16-18 వద్ద గుర్తు తెలియని రైలు/ గూడ్స్ క్రింద పడి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది అని తెలిపారు. మహిళ కుడి చెంప పై, యెడమ గడ్డం కింద మరియు నుదిటి పై చుక్క లాంటి పచ్చ బొట్లు ఉన్నాయని ఎవరైనా గుర్తుపడితే రైల్వే సిబ్బందికి సమాచారం ఇవ్వాలని కోరారు. వివరాల కోసం రైల్వే సిబ్బంది దర్యాప్తు నిర్వహిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం రైల్వే అధికారు ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు.



