స్మార్ట్ మీటర్లు మరియు కరెంట్ చార్జీలు భారాలకు వ్యతిరేకంగా ఉద్యమిద్దాం సిపిఎం

రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏడాదికాలంలోనే ప్రజలపై సుమారు 18 వేల కోట్ల రూపాయల కు పైగా కరెంటు చార్జీల బారాలు వేసిందని, ఇది చాలదన్నట్లు ప్రతి ఇంటికి స్మార్ట్ మీటర్ బిగించి మరింత భారం మోపాలని చూస్తుందని ఈ భారాలకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు  ఉంటాయని, ఉద్యమాలలో కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని, సిపిఎం పార్టీ జిల్లా  కార్యదర్శి డి. గౌస్ దేశాయ్ గౌస్, జిల్లా కార్యవర్గ సభ్యులు కే. వెంకటేశులు పిలుపునిచ్చారు.
కర్నూలు జిల్లా అదోనిలో సిపిఎం పార్టీ రాజకీయ శిక్షణ తరగతులు రెండో రోజు కొనసాగాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్ గత ఐదేళ్లలో వేసిన కరెంటు చార్జీల భారాన్ని ఒక్క సంవత్సరంలోనే కుటమి ప్రభుత్వం ప్రజలపై వేసిందని ఈ భారాలకు వ్యతిరేకంగా ఇప్పటికే తీవ్రమైన ఉద్యమాలు జరిగాయని భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు చేపట్టాల్సి ఉంటుందని కార్యకర్తలు అందరూ కూడా ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
ఈ క్లాసులో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి లింగన్న మండల కార్యదర్శి వర్గ సభ్యులు బి. వీరారెడ్డి, ఎం. ఉచ్చిరప్ప, రామాంజనేయులు, మండల నాయకులు భాష, అయ్యప్ప, మునిస్వామి, పాండురంగ, తిక్కప్ప, హనుమంత్ రెడ్డి, అయ్యన్న, పాండవగల్ సర్పంచ్ కె. ఉమాదేవి, శాఖా కార్యదర్శులు నాగరాజు, విరుపాక్షి, పరమేష్, నరసమ్మ పార్టీ సభ్యులు మరియు సానుభూతిపరులు పాల్గొన్నారు.

సిపిఎం పార్టీ రాజకీయ శిక్షణ తరగతులో పాల్గొన్నా నాయకులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Exit mobile version