భోగిమంటల్లో విద్యుత్ బిల్లులు వేసి నిరసన, సిపిఎం..

రాష్ట్ర కమిటీ పిలుపులు భాగంగా కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని పాండవగల్లు, కొత్తూరు దొడ్డనకేరి, ఆరెకల్లు, గ్రామాలలో విద్యుత్ బిల్లులను భోగిమంటల్లో వేసి దద్దం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కే లింగన్న, కార్యదర్శివర్గ సభ్యులు. రామాంజనేయులు మాట్లాడుతూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు  ఎలాంటి కరెంటు చార్జీలు పెంచమని, చార్జీలు, యధావిధిగా కొనసాగిస్తామని ఇచ్చిన మాటను తప్పారని, ఇప్పటికే ప్రజలపై సుమారు 18 వేల కోట్ల రూపాయలు భారం వేసారని, మళ్లీ భారం వేయడానికి ప్రజాప్రాయ సేకరణ చేపట్టారని, మళ్లీ విద్యుత్ చార్జీల పెంపదలను సిపిఎం పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల నాయకులు అయ్యప్ప, పాండురంగ, కే మునిస్వామి, శాఖ కార్యదర్శిలు ఎస్ అనిఫ్, కర్ణ, పార్టీ సభ్యులు కృష్ణ, బీమా,  తాయన్న, యు. హనుమంత్ రెడ్డి, కే. హనుమంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

https://publicjudgement.in/wp-content/uploads/2025/01/VID-20250113-WA0009.mp4
కరెంట్ బిల్లులను కాలుస్తున్న వీడియో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Exit mobile version