ప్రాణాలు కాపాడే వైద్యులను మాన, ప్రాణాలు తీసిన కోల్ కత్తాలో కలకలం రేపిన సంఘటన పై
కర్నూలు జిల్లా ఆదోని ప్రభుత్వ, ప్రవేట్ అసుపత్రులలో ఓ.పి వైద్యసేవలు నిలిపి వేసి ఆసుపత్రులలో పనిచేసే వైద్యులకు రక్షణ కల్పించాలని జి.జి.హెచ్ అసూపత్రి నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ప్ల కార్డులతో డాక్టర్లు వైద్య సిబ్బంది భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. సబ్ కలెక్టర్ కార్యాలయం సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. ఈ ర్యాలీ లో విద్యార్థి , ప్రజా , వైద్య సంఘాలు భారీ ఎత్తున పాల్గొన్నారు.
వైద్యులు డాక్టర్ శాంతి జ్యోతి మాట్లాడుతూ ఆగస్ట్ తొమ్మిదవ తేదిన కోల్ కత్తాలో ప్రభుత్వ వైద్యురాలి పై కొంత మంది దుండగులు వెళ్లి హత్యాచారం చేసి ఆపై హత్యచేసి పరార్ అయ్యారు మొత్తం మానవ సమాజం తలదించుకునేలా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు

ర్యాలీ నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది
మాట్లాడుతున్న డాక్టర్ శాంతి జ్యోతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *