ఘనంగా ఎరుకల హక్కుల పోరాట సమితి మహాసభలు
కర్నూలు జిల్లా మంత్రాలయం రాగసుధ లాడ్జ్ లో ఎరుకల హక్కుల పోరాట సమితి మహాసభలు జిల్లా అద్యక్షులు ఎరుకల కృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎరుకల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా SC/ST విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ ఎరుకల రాజు మరియు నంద్యాల జిల్లా అద్యక్షులు మెడసారి గోపాల్, ఆదోని సబ్ డివిజనల్ SC/ST విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ ఎరుకల రవికుమార్, డోన్ సెక్రటరీ చోటా రామయ్య, సీనియర్ జర్నలిస్ట్ వేణుగోపాల్ రెడ్డి, KVPS మంత్రాలయం తాలూకా కార్యదర్శి జయరాజు, అంజి హాజరయ్యి పాల్గొన్నారు.
ఎరుకల హక్కుల పోరాట సమితి నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో గిరిజన ఎరుకల ప్రజలు హక్కుల కోసం ఎరుకల హక్కుల పోరాట సమితి పోరాడుతుందని తెలిపారు. ఇటీవల సుప్రీం కోర్టు SC/ST రిజర్స్వేషన్ వర్గీకరణకు అనుకూలంగా తీర్పనిచ్చింది అని, SC వర్గీకరణ తో ST వర్గీకరణ కూడా చేపట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఏకలవ్య ఎరుకల కార్పొరేషన్ వెంటనే ఏర్పాటు చేసి ఎరుకల ప్రజలును ఆర్ధికంగా ఆదుకోవాలని కొరారు. మంత్రాలయం నియోజికవర్గంలో గిరిజన విద్యార్థుల కోసం గిరిజన గురుకుల ఆశ్రమ పాఠశాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఎరుకల బ్యాండ్ మెళా కళాకారులకు గుర్తింపు కార్డులు ఇచ్చి పెన్షన్ మంజూరు చేయాలని కోరారు. తదనంతరం ఎరుకల హక్కుల పోరాట సమితి నియోజికవర్గ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షులు గా సుగూరు గ్రామానికి చెందిన ఎరుకల బజారప్పను అధ్యక్షుడిగా ఎరుకల వెంకటేష్ ను ప్రధాన కార్యదర్శి గా , ఉపాధ్యక్షులుగా ఎరుకల రామాంజినేయులు, ఆంజనేయులు, హనుమంతు సహాయ కార్యదర్శులుగా, మహేష్, నాగరాజు, కృష్ణమూర్తి, కోశాధికారిగా ఎరుకల సురేష్, భీమెష్ లను ఏకిగ్రవంగ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో చిన్న భీమన్న, కోసిగి లక్ష్మన్న, రామలింగ, చిన్న పాండు తదితరులు పాల్గొన్నారు.