కర్నూలు జిల్లా అదోని ఎల్.బి.స్ట్రీట్ లో14వ తేదీ సోమవారం కరెంట్ స్తంభం వైర్ తెగి అయ్యమ్మ అనే వృద్ధురాలు మృతి చెందినందుకు విద్యుత్ శాఖ వారు ఆ కుటుంబానికి నష్టపరిహారంగా ఐదు లక్షల చెక్కును ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి చేతుల మీదుగా అందించారు.
ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ కేవలం 72 గంటల్లో ఐదు లక్షల పరిహారం విద్యుత్ శాఖ అధికారులతో ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి బాధితులకు అందించామని తెలిపారు.
వృద్ధురాలు కూతుళ్లు మాట్లాడుతూ మా తల్లిగారు చనిపోయిన మూడు రోజులకే 5 లక్షల పరిహారం అందించిన ఆదోని ఎమ్మెల్యే వై సాయి ప్రసాద్ రెడ్డి గారికి విద్యుత్ శాఖ డిఈ సుధాకర్ బాబు, ఏడీఈ పురుషోత్తంకు ఏఈ చెన్నయ్యకు కృతజ్ఞతలు తెలియజేసారు.



