విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో వృద్ధురాలు మృతి..

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని ఎల్.బి స్ట్రీట్ లో అయ్యమ్మ అనే 74 సంవత్సరాల వృద్ధురాలు పై కరెంటు తీగ తెగిపోయి కిందపడి మృతి చెందింది. ప్రమాదకరంగా ఉన్నా విద్యుత్ తీగల పై కోతి కూర్చొని ఉపడంతో తెగి కింద వృద్ధురాలి పై పడిందని బాధితులు తెలిపారు. కంప్లైంట్ ఇచ్చిన విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు మా అమ్మ మృతి చెందిందని కూతురు ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేసింది. కంప్లైంట్ ఇచ్చినప్పుడే విద్యుత్ అధికారులు స్పందించి ఉంటే ఈ ఘోరం జరిగేది కాదన్నారు…
ఘటన స్థలానికి చేరుకొని మృతురాలి కుటుంబాన్ని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి పరామర్శించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని విద్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

తెగిపడిన విద్యుత్ తీగ
విద్యుత్ తీగలను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి
పూర్తి వివరాల కోసం యూట్యూబ్ వీడియో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Exit mobile version