కర్నూలు జిల్లా ఆదోని విక్టోరియా పేటలో ఆస్తికోసం ఇల్లు తన పేరుపై సంతకాలు చేయాలని తల్లి పార్వతి పై కొడుకు నాగరాజ్ దాడికి పాలుపడ్డాడు. అది గమనించిన స్థానికులు బంధువులకు సమాచారం ఇవ్వడం చికిత్స నిమిత్తం ఆదోని ప్రభుత్వాసులకు తరలించరు. వివరాల్లోకెళ్ తే వివరాల్లోకి వెళ్తే పార్వతికి ఒక కొడుకు ఇద్దరు కుమార్తెలు కొడుకు నాగరాజ్ బాధ్యతలు వదిలి తాగుడుకు బానిసై బెంగళూరుకి వెళ్లిపోయాడు తల్లి పార్వతి తన ఇద్దరు కూతుర్ల వద్ద జీవనం సాగిస్తుంది. ఆమె తల్లి ఆస్తిలో భాగంగా వచ్చిన ఇండ్లు బాడుగకు ఇచ్చి ఆ వచ్చిన నగదు తో మరియు ప్రభుత్వం నుంచి పింఛన్ తో కూతుర్ల వద్దనె తల దాచుకుంటుంది.
తల్లి పార్వతి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి గురువారం రోజు బెంగళూరు నుంచి వచ్చిన కొడుకు నాగరాజు ఇల్లు తన పేరుపై సంతకాలు చేయాలని చెప్పడంతో తల్లి పార్వతి సంతకం చేయనని తన జీవన ఆధారం వచ్చే బాడుగ పైనే గడుస్తుందని చెప్పడంతో తనపై దాడి చేశాడని పార్వతి ఆవేదన వ్యక్తం చేసింది.